ఇఫీ వేదికగా ‘వారణాసి’ కీలక అప్‌డేట్‌ ఇచ్చిన కీరవాణి.. మొత్తం ఎన్ని పాటలు ఉన్నాయంటే?

Wait 5 sec.

యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో 'వారణాసి' ఒకటి. సూపర్ స్టార్ , దర్శక ధీరుడు ఎస్.ఎస్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ ఇది. ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ వర్సటైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా మ్యూజికల్ అప్డేట్ బయటకు వచ్చింది. 'వారణాసి' చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. RRR సినిమాకి గాను ఆస్కార్ అవార్డ్ సాధించిన తర్వాత, రాజమౌళి - కీరవాణి కలిసి చేస్తున్న మూవీ కావడంతో మ్యూజిక్ పై అందరిలో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే రిలీజైన గ్లోబ్ ట్రాటర్ సాంగ్ 'సంచారి', 'రణ కుంభ' ఆడియో సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో ఇంకా ఎలాంటి పాటలు ఉంటాయో అనే చర్చలు జరుగుతున్న తరుణంలో, కీరవాణి ఈ సినిమా మ్యూజికల్‌ అప్‌డేట్‌ అందించారు. గోవా వేదికగా జరుగుతోన్న ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి - 2025) వేడుకలకు కీరవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వారణాసి’ మ్యూజిక్ చాలా గ్రాండియర్ గా ఉంటుందని అన్నారు. అంతకు మించి ఈ ప్రాజెక్ట్‌ గురించి ఇప్పుడే ఏం చెప్పలేనంటూనే, ‘వారణాసి’లో మొత్తం 6 పాటలు ఉంటాయనే విషయాన్ని వెల్లడించారు. మనం చేసే పనిపై క్లారిటీ, నమ్మకం ఉంటే ఏవిషయమూ మనకు ఒత్తిడిగా అనిపించదని.. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని కీరవాణి చెప్పారు.