ఏపీ సరిహద్దుల్లో భారీ మావోయిస్టు ఆపరేషన్.. టాప్ నేతలు హతం..?

Wait 5 sec.

మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పార్టీలోని కీలక నేతలు లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్రం.. మావోయిస్టులు ప్రతిపాదించిన కాల్పుల విరమణ చర్చలను తిప్పికొట్టింది. మావోయిస్టులతో చర్చలు లేవని.. వారు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని తెగేసి చెప్పింది. 2026 మార్చిలోగా మావోయిస్టులను అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేసిన కేంద్రం.. ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ ప్రారంభమైట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.భారీ యాంటీ మావోయిస్టు ఆపరేషన్..?ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్.. మూడు రాష్ట్రాల ట్రై జంక్షన్‌లో భారీ యాంటీ మావోయిస్టు ఆపరేషన్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో కొనసాగుతోన్న ఆపరేషన్‍లో.. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కీలక నేతలు పట్టుబడ్డట్లు లేదా హతమైనట్లు సమాచారం. కాగా, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆరుగురి మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవి ఎవరివి అనేది దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కీలక మావోయిస్టు నేతలు లొంగుబాటు..మరోవైపు, మావోయిస్టు పార్టీ అగ్రనేతల లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనతేలు వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఆయుధాలతో సహా లొంగిపోయారు. (ఛత్తీస్‌గఢ్‌) సాధారణ ప్రజల్లో కలవడానికి నిర్ణయించుకున్నారు. ఈ ముగ్గురు నేతలు దక్షిణ బస్తర్‌ దళంలో కీలక స్థానాల్లో పని చేశారు. మొగిలిచర్ల చందు (45) మావోయిస్టు స్టేట్‌ కమిటీ నెంబర్‌గా చేశారు. ఆ తర్వాత తెలంగాణ డీజీపీ శివధర్‌ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆయన మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్‌గా, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు. బండి ప్రకాష్, దాదాపు 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.వారంతా విప్లవ ద్రోహులు..కీలక మావోయిస్టు నేతలు మల్లోజుల, ఆశన్న పోలీసులకు లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. వారికి ప్రజలే తగిన శిక్ష విధించాలని.. వారిని తన్ని తరిమేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారిద్దరు లొంగిపోయారని ఆరోపణలు చేసింది. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రాణభీతి ఉన్నవాళ్లు ఎవరైనా లొంగిపోవచ్చని.. కానీ ఆయుధాలు మాత్రం అప్పగించకూడదని విజ్ఞప్తి చేసింది.