కోల్‌కతా టెస్టు‌పై తొలిసారి నోరువిప్పిన ఈడెన్ గార్డెన్స్ పిచ్ క్యూరేటర్

Wait 5 sec.

. కోల్‌కతాలోని వేదికగా జరిగిన ఈ టెస్టు మూడు రోజుల్లోపే ముగిసింది. దాంతో అక్కడ పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇలాంటి సందర్భంలో పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తొలిసారిగా స్పందించాడు. ఫలితాలు, ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ తాను పిచ్‌ను పూర్తిగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తయారు చేసినట్లు ఆయన స్పష్టం చేశాడు. కోల్‌కతా పిచ్‌పై కనీసం ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా 200కు పైగా పరుగులు నమోదు కాలేదు. దక్షిణాఫ్రికా ఒక్కటే రెండు ఇన్నింగ్స్‌లలో 150కి పైగా పరుగులు చేయగా, భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై భారత్ దారుణ ఓటమికి పిచ్ పరిస్థితులే కారణమంటూ కొందరు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ టెస్టులో ఓడిన భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. “ఈ పిచ్ అందరూ అనుకున్నంత వరెస్ట్‌గా లేదు. టెస్టు మ్యాచ్ కోసం పిచ్‌ను ఎలా సిద్ధం చేయాలో నాకు బాగా తెలుసు. నన్ను ఎలా ఇన్‌స్ట్రక్ట్ చేస్తారో అచ్చం అలాగే పని చేస్తాను. ఎవరు ఏమంటారో ఎక్కువగా పట్టించుకోను. అందరికీ అన్నీ తెలియవు. నాకు ఉన్న బాధ్యతను నిస్వార్థంగా నిర్వర్తించడం నా లక్ష్యం” అని ఓ ఇంటర్వ్యూలో పిచ్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు.భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా పిచ్ క్యూరేటర్‌కు మద్దతుగా నిలిచాడు. బ్యాటర్లు ప్రెజర్‌ను తట్టుకుని రన్స్ చేయాల్సిన సమయంలో విఫలమైనందుకే ఇలా జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. మూడు రోజులకే ముగిసిన ఈ మ్యాచ్‌లో 124 పరుగులను సక్సెస్‌ఫుల్‌గా డిఫెండ్ చేసిన దక్షిణాఫ్రికా, భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించింది.“వికెట్ అంతగా ఆడలేనిది కాదు. ఎలాంటి భయంకరమైన లక్షణాలూ అందులో లేవు. సహనం ఉంటే రన్స్ కచ్చితంగా వస్తాయి” అని మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ అన్నాడు. ఇటీవల భారత్ హోమ్ గ్రౌండ్‌లో ఆడిన 6 టెస్టుల్లో 4 ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో ఈడెన్ గార్డెన్స్ ఫలితం మరింత చర్చనీయాంశమైంది. అయితే పిచ్‌పై ఆరోపణలను నిరాకరిస్తున్న క్యూరేటర్ ప్రకటనతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది.