: ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుందన్న సంగతి తెలిసిందే. దీని ఆధారంగానే నిర్ణయిస్తారు. ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉండగా.. ఇది ఈ ఏడాది చివరితో ముగియనుంది. ఈ క్రమంలోనే 8వ వేతన సంఘంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వచ్చింది. జనవరిలోనే కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపినప్పటికీ.. విధివిధానాల ఆమోదానికి చాలా నెలలు పట్టింది. గత నెలలోనే దీనిపై ప్రకటన వచ్చింది. ఈ సిఫార్సుల్ని వేతన కమిషన్ సమర్పించేందుకు 18 నెలల గడువు ఉంటుంది. వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్.. సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అయితే వేతన సంఘం సిఫార్సుల్ని బట్టే.. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) సహా పింఛన్‌ దారులకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) ఇంకా ఇతర అలవెన్సులు పెరుగుతుంటాయన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఏడో వేతన సంఘం ముగియనుండగా.. అమలయ్యేందుకు మరో సంవత్సరానికిపైగా పడుతుందని భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ 31 తర్వాత డీఏ, డీఆర్ సహా హెచ్ఆర్ఏ వంటి వాటి పెంపుల్ని కేంద్రం నిలిపివేస్తుందా అనేది చాలా మందికి ఎదురవుతున్న ప్రశ్న. దీనిపై కొందరు నిపుణులు సమాధానాలు ఇచ్చారు. కొత్త వేతన సంఘం నియమ నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుత 7వ వేతన సంఘం సిఫార్సుల్ని బట్టి.. డీఏ, హెచ్ఆర్ఏ పెంపు కొనసాగుతూనే ఉంటుందనే అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ (కరవు భత్యం) 58 శాతంగా ఉంది. ఈ మేరకు నెక్స్‌డిగ్మ్ (Nexdigm) డైరెక్టర్ (పేరోల్స్) రామచంద్రన్ కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త వేతన సంఘం వచ్చే వరకు పాత నిబంధనలు వర్తిస్తాయని అన్నారు. డీఏ అనేది ప్రతి 6 నెలలకు కేంద్రం సవరిస్తుంటుంది. పెరుగుతున్న ధరలకు పరిహారంగా దీనిని అందిస్తుంది. కాబట్టి కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే అంచనా సమయం 18 నెలలు అనుకుంటే ఈ సమయంలో 3 సార్లు డీఏ సవరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రతిసారీ 3 శాతం చొప్పున పెరిగినా.. 18 నెలలకల్లా ఇది 67 శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో డీఏ పెరుగుదల అనేది పోషిస్తుందని చెప్పారు ఆలిండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మంజీత్ సింగ్ పటేల్. వచ్చే 18 నెలల్లో.. 2 వార్షిక ఇంక్రిమెంట్స్ (7 శాతం చొప్పున), ఇంకా డీఏ పెరుగుదల వల్ల ఉద్యోగి మూలవేతనం పెరుగుతుందని.. దీంతో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది సుమారు 2.13 గా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే ఈ లెక్కన ఉద్యోగి కనీస వేతనం 2.13 రెట్లు పెరగొచ్చన్నమాట. కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తే.. అప్పుడు డీఏ అనేది బేసిక్ పేలో కలిసి.. మళ్లీ సున్నా నుంచి ప్రారంభం అవుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు.