22k Gold Price: భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. చాలా దేశాల వద్ద ఉన్న బంగారం కన్నా మన దేశంలోని మహిళల వద్ద ఉన్న బంగారమే ఎక్కువట. అంతలా మన దేశంలో బంగారం వినియోగం అవుతోంది. అయితే, ఈ ఏడాది 2025లో పసిడి ధరలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. స్వచ్ఛమైన తులం బంగారం రేటు రూ.1.25 లక్షలు పైన కొనసాగుతోంది. అయితే, ఈరోజు భారీగానే తగ్గింది. గతంలో కంటే భారీగానే తగ్గింది. తులం రేటు రూ.1700 వరకు దిగివచ్చింది.అమెరికాలో నిరుద్యోగిత రేటు పెరిగే అవకాశం ఉండడంతో ద్రవ్యల్బోణం తారుమారు కాచ్చనే అంచనాలు ఉన్నాయని, అందుకే వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆచితూచి వ్యవహరించాల్సి వస్తుంది ఫెడ్ వైస్ ఛైర్మన్ ఫిలిప్ జెఫెర్సన్ వెల్లడించారు. వడ్డీ రేట్లు తగ్గింపు ఉండకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా దిగివచ్చాయి. ఈ క్రమంలో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 4000 డాలర్ల దిగువ స్థాయికి చేరింది. ఆ ప్రభావం దేశీయంగా స్పష్టం కనిపించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ జువెలర్స్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు ఎంతకు దిగివచ్చిందో తెలుసుకుందాం. తనిష్క్ జువెలరీలో.. తనిష్క్ జవెలరీలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 1 గ్రాముకు దాదాపు రూ. 160 మేర తగ్గింది. దీంతో గ్రాము ధర రూ. 11,375 వద్దకు దిగివచ్చింది. అదే 10 గ్రాములు (తులం) అయితే రూ. 1,13,750 వద్దకు తగ్గింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లోమలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ జువెలరీ సంస్థలో ఈరోజు 22 క్యారెట్ల నగల తయారీ బంగారం రేటు 1 గ్రాముకు రూ.165 మేర తగ్గింది. దీంతో గ్రాము ధర రూ.11,335 వద్దకు దిగివచ్చింది. అలాగే తులం రేటు రూ. 1,13,350 వద్దకు దిగివచ్చింది. జొయాలుక్కాస్‌లో రూ. 11,335 ఉండగా తులానికి రూ. 1,13,350 వద్ద ట్రేడవుతోంది. లలితా జువెలరీలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ జువెలరీ సంస్థ లిలితా జువెలరీలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం రేటు 1 గ్రాముకు రూ. 11,335 వద్దకు దిగివచ్చింది. ఇక తులం (10 గ్రాముల) రేటు రూ. 1,13,350 వద్ద అమ్ముడవుతోంది.