మధ్యప్రదేశ్‌లో దారుణం.. బిహార్ ఫలితాలపై వాగ్వాదం.. యువకుడ్ని చంపిన మేనమామలు!

Wait 5 sec.

గతవారం వెల్లడయిన మేనల్లుడు, మేనమామల మధ్య జరిగిన వాగ్వాదం చివరకు హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఆవేశంలో యువకుడ్ని హత్యచేసిన దారుణమైన ఈ షాకింగ్ మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గుణ కంట్మోనెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ క్వార్టర్స్ నిర్మాణం జరుగుతుండగా.. అక్కడ బిహార్‌లోని షియోహర్ జిల్లా చెందిన శంకర్ మాంఝీ(22), అతడి మేనమామలు తుఫానీ (35), రాజేశ్‌లు (29) సహా పలువురు కార్మికులుగా పనిచేస్తున్నారు. నిర్మాణం జరుగుతోన్న చోటే వీరంతా ఉంటుంన్నారు. ఆదివారం రాత్రి ముగ్గురూ వంట చేసుకున్న తర్వాత మద్యం సేవించారు.ఈ క్రమంలో ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావన మొదలై వాగ్వాదానికి దారితీసింది. శంకర్ మద్దతుదారుకాగా... తుఫానీ, రాజేశ్‌లు జేడీయూ అభిమానులు. వీరి మధ్య వాగ్వాదం తీవ్రం కావడంతో తుఫానీ, రాజేశ్‌లు సహనం కోల్పోయి శంకర్‌పై దాడికి దిగారు. అతడ్ని దారుణంగా కొట్టి, సమీపంలో ఉన్న చెరువు దగ్గరకు ఈడ్చుకెళ్లారు. అక్కడ భయంకరమైన రీతిలో కిందపడేసి, బురదలోకి ముఖం నెట్టి, ఊపిరాడకుండా బలంగా అదిమిపట్టుకున్నారు. నోరు, ఊపిరితిత్తుల్లోకి బురద వెళ్లడంతో శంకర్ అక్కడికక్కడే ఊపిరి ఆడక చనిపోయాడు.అనంతరం అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. నిర్మాణస్థలిలో గుర్తుతెలియని మృతదేహం పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. గంటలోనే నిందితులు ఇద్దర్ని పట్టుకున్నట్టు గుణ ఎస్పీ అంకిత్ సోనీ తెలిపారు. విచారణలో హత్యకు దారితీసిన కారణాలను నిందితులు వెల్లడించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వాగ్వాదం హింసాత్మకంగా మారి ప్రాణాలు పోయేవరకు వెళ్లినట్టు వెల్లడయ్యింది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి.. వారిపై హత్య కేసు నమోదుచేశామని ఎస్పీ పేర్కొన్నారు. రాజకీయ శత్రుత్వం, మద్యం మత్తు, ఆవేశంలో తమ సొంత మేనల్లుడ్ని చంపినట్టు తేలింది.ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లోనూ రాజకీయ అభిరుచులు ఆవేశంగా మారి హత్యలకు దారితీస్తాయో ఇది స్పష్టంగా తేలియజేస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేశామని, విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. కాగా,.. అధికారం నిలబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్డీయే కూటమికి 202 స్థానాలు రాగా.. ఇండియా కూటమి 34 సీట్లకే పరిమితమైంది. అధికారంపై ఆశలు పెట్టుకున్న తేజస్వీ యాదవ్‌కు ఈసారి కూడా నిరాశ తప్పలేదు.