మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే.. 30 వేల ఎకరాల్లో తెలంగాణలో కొత్త నగరం నిర్మాణం..

Wait 5 sec.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం (నవంబర్ 18) హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో జరిగిన పట్టణాభివృద్ధి ప్రాంతీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో పాటు పలు రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధికి, ముఖ్యంగా ప్రతిష్టాత్మక 'భారత్ ఫ్యూచర్ సిటీ' ప్రాజెక్టుకు కేంద్రం నుంచి తక్షణ సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఫ్యూచర్ సిటీ .. 30 వేల ఎకరాల్లో భారీ నిర్మాణం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ పట్టణాభివృద్ధి ప్రాజెక్టు కేవలం తెలంగాణకే కాకుండా.. యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని సీఎం అన్నారు. అయితే.. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి, ప్రామాణిక అనుమతులు , నిధుల మద్దతు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని ఆయన కేంద్ర మంత్రిని కోరారు.కేంద్ర ప్రాజెక్టులకు అనుమతుల కోసం వినతి.. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు తక్షణమే ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. అందులో మొదటిది మూసీ పునరుజ్జీవం. హైదరాబాద్‌లోని మూసీ నదిని పునరుద్ధరించి, నదీ తీరాన్ని అభివృద్ధి చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అనుమతి.రెండోది . నగర శివార్లలో భారీ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఉద్దేశించిన రీజినల్ రింగ్ రోడ్డు (RRR) ఉత్తర భాగానికి త్వరగా నిధులు కేటాయించాలని కోరారు. మూడోది . నగర రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి మెట్రో రైలు మార్గాల విస్తరణకు అనుమతి.'రైజింగ్ తెలంగాణ విజన్ 2047' దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. భారతదేశం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (3 Trillion Dollar Economy) లక్ష్యాన్ని చేరుకోవడంలో తెలంగాణ రాష్ట్రం 10 శాతం వాటాను అందించాలని చూస్తున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యాలను చేరడానికి, డిసెంబర్ 9న 'రైజింగ్ తెలంగాణ విజన్ 2047' డాక్యుమెంట్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇంకా.. పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను ప్రోత్సహించడానికి, రాబోయే మూడేళ్లలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే నడుపుతామని హామీ ఇచ్చారు. ఈ విధంగా అన్ని రంగాలలో తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టడానికి కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.