విజయవాడలో మావోయిస్టుల కలకలం.. 27 మంది అరెస్ట్.. ఇంటెలిజెన్స్ ఏడీజీ కీలక ప్రకటన

Wait 5 sec.

విజయవాడ నగరం మంగళవారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో మావోయిస్టుల కలకలం రేగింది. ఒకరూ ఇద్దరు కాదు ఏకంగా 27 మంది మావోయిస్టులు పట్టుబడటం సంచలనం రేపింది. విజయవాడ నగర శివారు ప్రాంతమైన.. కానూరు కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టులు ఉన్నట్లు కేంద్ర బలగాలకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మంగళవారం కేంద్ర బలగాలు ఆటోనగర్‌లో సోదాలు నిర్వహించాయి. స్థానిక పోలీసుల సహకారంతో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బలగాలు న్యూ ఆటోనగర్‌లో తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా భావిస్తున్నారు. మావోయిస్టులు పదిరోజుల కిందట ఈ ప్రాంతానికి వచ్చినట్లు అనుమానిస్తున్నారు.కూలీ పనుల కోసం వచ్చామని చెప్పి.. భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు భవనం యజమాని నెలన్నర నుంచి విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. భవన యజమాని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. భవనం వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయవాడలో అరెస్ట్ అయిన 27 మందిలో 12 మంది మహిళలు ఉన్నారు. అలాగే నలుగురు ఉన్నట్లు సమాచారం. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు సమాచారం. నాలుగు చోట్ల డంప్‌లు ఏర్పాటు చేశారని పోలీసులకు సమాచారం చేరింది. దీంతో ఆ డంప్‌లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. 31 మంది మావోయిస్టులు అరెస్ట్...మరోవైపు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. అరెస్ట్ చేసిన మావోయిస్టులలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారన్నారు. వారి నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 1525 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 150 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లతో పాటుగా ఏకే 47 తొపాకులు రెండు, పిస్టల్, రివాల్వర్‌తో పాటుగా పలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మంగళవారం ఉదయం జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో హిడ్మా అతని భార్య సహా ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు మహేష్ చంద్ర లడ్డా వివరించారు.