సినీ ఇండస్ట్రీకి పట్టిన పైరసీ భూతం వదిలింది.. హైదరాాబాద్ పోలీసులకు థాంక్స్

Wait 5 sec.

అనే పైరసీ వెబ్‌సైట్‌తో భారతీయ సినీ పరిశ్రమని వణికించిన ఇమ్మడి రవిని రెండ్రోజుల క్రితం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అతడి నుంచి లాగిన్ వివరాలు సేకరించిన పోలీసులు రవితోనే ఐబొమ్మ వెబ్‌సైట్‌ని బ్లాక్ చేయించారు. అతడి బ్యాంక్ అకౌంట్లలోని రూ.3కోట్లకు పైగా నగదును సీజ్ చేయడంతో పాటు వందలాది హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రవిని న్యాయస్థానంలో హాజరుపరకగా 14 రోజుల రిమాండ్ విధించారు. రవి అరెస్టుతో తెలుగు సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో , నాగార్జున రాజమౌళి, సురేష్‌బాబు, దిల్ రాజు వంటి సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ.. పైరసీ వల్ల సినీ ఇండస్ట్రీ ఎంతో నష్టపోతోంది. దీనివల్ల సినీ ఇండస్ట్రీతో పాటు సామాన్య ప్రజలకూ నష్టమే. సినీ రంగం ఎన్నో కష్టనష్టాలను ఓర్చి సినిమాలు తీస్తుంటే పైరసీ వల్ల వేలాది సినీ కుటుంబాలు నష్టపోతున్నాయి. గతంలో సీవీ ఆనంద్, ఇప్పుడు సజ్జనార్ పైరసీపై యుద్దంలో మాకు అండగా నిలబడి నేరస్థుల్ని పట్టుకున్నారు. తెలంగాణ పోలీసులు పైరసీ కట్టడికి ఎంతో సాయపడ్డారు. వేలాది మంది కష్టాన్ని దోచుకుంటోన్న రవి లాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. కొన్ని వేల మంది కష్టాన్ని ఒక్కడు దోచుకోవడం కరెక్ట్ కాదు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షిస్తే మరొకరు అలాంటి నేరాలు చేయడానిక భయపడతారు’ అని అన్నారు.