ప్రతి 1 షేరుకు 2 షేర్లు బోనస్.. ఆల్ టైం హైని తాకిన షేరు.. లక్షకు రూ.2.42 లక్షలు

Wait 5 sec.

FMCG Stock: స్మాల్ క్యాప్ కేటగిరి, ఎఫ్ఎంసీజీ సెక్టార్ సంస్థ జీఆర్ఎం ఓవర్సీస్ లిమిటెడ్ () తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. నవంబర్ 13 నాటి బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో రెండో త్రైమాసికం ఫైనాన్సియల్ రిజల్ట్స్ సహా తమ షేర్ హోల్డర్లకు ఇవ్వడానికి ఆమోదం తెలుపినట్లు వెల్లడించింది. ఈ కంపెనీ షేర్ ధర చివరి ట్రేడింగ్ సెషన్‌లో 7 శాతానికి పైగా లాభంతో సరికొత్త 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 489ని టచ్ చేసింది.మరోవైపు ఈ కంపెనీ షేర్ గత ఏడాదిలో 142 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో నిలిచింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. నవంబర్ 13న జరిగిన కంపెనీ బోర్డు సమావేశంలో 2:1 రేషియోలో బోనస్ షేర్లు జారీ చేసేందుకు ఆమోదం లభించింది. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని తమ డీమ్యాట్ అకౌంట్లో కలిగి ఉంటే వారికి అదనంగా రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2 ఈక్విటీ షేర్లు ఉచితంగా బోనస్ రూపంలో లభిస్తాయి. అయితే బోనస్ షేర్ల జారీ రికార్డు డేట్ త్వరలో ప్రకటించనున్నట్లు కంపెనీ తెలిపింది. పెరిగి రూ. 14.76 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 9.19 కోట్ల వద్ద ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 15 శాతం లాభంతో రూ. 362.43 కోట్లుగా నమోదైంది. చివరి ట్రేడింగ్ సెషన్‌లో జీఆర్ఎం ఓవర్సీస్ లిమిటెడ్ షేరు 6.7 శాతం లాభంతో రూ. 480.50 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 489, కనిష్ఠ ధర రూ. 175.90 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ షేరు 10 శాతం లాభాన్ని ఇచ్చింది. గత నెల రోజుల్లో 21 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 53 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాది కాలంలో 142 శాతం లాభాన్ని అందించింది. ఏడాది క్రితం లక్ష రూపాయలు పెట్టి షేర్లు కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ రూ.2.42 లక్షలు అవుతుంది. చివరగా గత ఐదేళ్లలో 8 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 2950 కోట్ల వద్ద ఉంది.