కాసులు కురిపిస్తోన్న గ్రో.. 4 రోజుల్లోనే 70 శాతం లాభం.. రూ.1,00,000 కోట్లకు మార్కెట్ విలువ

Wait 5 sec.

Groww share: ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ గ్రో పేరెంట్ కంపెనీ బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ లిమిటెడ్ షేర్లు అదరగొడుతున్నాయి. స్టాక్ మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి. గత వారంలోనే స్టాక్ మార్కెట్‌లోకి ఈ కంపెనీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మంచి లాభాలతో లిస్టింగ్ అయిన ఈ స్టాక్ వరుసగా నాలుగో రోజూ భారీ లాభాల్లో దూసుకెళ్తోంది. తమ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందిస్తోంది. ఈ స్టాక్ ఈరోజు ఇంట్రాడేలో చూసుకుంటే రూ. 154.15 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ 15 శాతం మేర లాభంతో సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర రూ. 171.70ని తాకింది. ఆ తర్వాత కాస్త వెనక్కి తగ్గింది. 33.19 కోట్ల షేర్లు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఈ స్టాక్ లిస్టింగ్ ధరనే 52 వారాల కనిష్ఠ ధరగా ఉంది. అంటే లిస్టింగ్ తర్వాత దూసుకెళ్తూనే ఉంది. ఈ స్టాక్ ప్రైస్ బ్యాండ్ రూ. 100 నుంచి చూసుకుంటే 70 శాతం మేర లాభాలు అందించింది. అదే లిస్టింగ్ ధర రూ. 112తో పోల్చి చూస్తే 53 శాతం మేర లాభాలు అందించింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 1 లక్ష కోట్ల మార్క్ దాటింది. విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ఇష్యూ ధర రూ. 100తో పోలిస్తే ఎన్ఎస్ఈఓలో 12 శాతం లాభంతో రూ. 112 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టింది. అదే రోజున రూ. 128.85 వద్ద ముగిసింది. ఆ తర్వాత కంపెనీ షేర్లు 53 శాతం మేర పెరిగాయి. రూ. 6,632 కోట్ల నిధులు సమీకరించే లక్ష్యంతో నవంబర్ 4వ తేదీన ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఐపీఓలో భాగంగా ప్రైస్ బ్యాండ్ రూ. 95 నుంచి రూ. 100గా నిర్ణయించారు. 17 రెట్లకు పైగా సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. 2016లోనే ప్రారంభమైన గ్రో సంస్థ దేశంలోని అతిపెద్ద స్టాక్ బ్రోకింగ్ కంపెనీగా అవతరించింది. 2025 జూన్ నెల నాటికి కంపెనీ 26 శాతం మేర మార్కెట్ వాటా కలిగి ఉంది.