ప్రయాణికులకు ఊరట.. సంక్రాంతి నుంచి విజయవాడ బైపాస్‌పై వాహనాల పరుగులు..

Wait 5 sec.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభవుతున్నాయి. అందులో భాగంగానే ప్యాకేజీ-4 పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. చివరి దశ పనులు వేగంగా పూర్తి చేసి.. సంక్రాంతి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులన్నీ ఉప్పొంగాయి. ఈ నేపథ్యంలో కురగల్లులో కొండవీటి వాగు కూడా ఉద్ధృతంగా ప్రవహించింది. ఈ సమయంలో నష్ట నివారణ చర్యల్లో భాగంగా మంగళగిరి మండలం కురగల్లులో 40 మీటర్ల మేర రహదారిని అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్ (ఏడీసీఎల్‌) తొలగించింది. కాగా, ఇప్పుడు పరిస్థితులు కుదుటపడటంతో.. రహదారి నిర్మాణం తిరిగి ప్రారంభించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పే ఎన్వోసీ.. జాతీయ రహదారుల అధికారులకు అందింది. దీంతో పనులు ప్రారంభించడానికి మార్గం సుగమం అయింది. విజయవాడ పశ్చిమ బైపాస్‌ను 47.8 కిలో మీటర్ల మేర రెండు ప్రధాన భాగాలుగా నిర్మిస్తున్నారు. రెండో భాగంలో ప్యాకేజీ-4 ఉంది. ఈ ప్యాకేజీలో గొల్లపూడి నుంచి కాజ వరకు వరకు 17.6 కిలోమీటర్ల మేర రహదారి నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పటికే గొల్లపూడి నుంచి వెంకటాయపాలెం వరకు 6.5 కిలోమీటర్ల మేర రాకపోకలు సాగుతున్నాయి. ఈ 40 మీటర్ల రహదారి పూర్తయితే.. వెంకటాయపాలెం నుంచి హాయ్‌ల్యాండ్‌ వరకు 10.5 కిలోమీటర్ల మేర రాకపోకలకు ఇబ్బంది ఉండదు. ఇక మిగిలింది కాజ దగ్గర ఎన్‌హెచ్‌-16తో (చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి) అనుసంధానం చేయడమే. ఈ ప్రాంతంలో సర్వీస్‌ రోడ్లను వేరు చేస్తూ రక్షణ గోడలు, విజయవాడ వెళ్లే వాహనాలు యూటర్న్‌ తిరిగేందుకు అనువుగా మరో రెండు వరుసల రహదారి నిర్మించాల్సి ఉంటుంది. మరోవైపు, ఇప్పటికే ప్యాకేజీ-3 పనులు తుది దశకు చేరుకున్నాయి. దీంతో విజయవాడ రాకుండా చినఆవుటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా హైదరాబాద్‌- విశాఖపట్నం వెళ్లేందుకు రాకపోకలు మొదలయ్యాయి. అమరావతి ఓఆర్ఆర్..ఇదిలా ఉండగా, ఇటీవల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్‌) నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. భూసేకరణ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లాలోని రెండు మండలాల్లోని 12 () ప్రచురించింది. ఈ గెజిట్లలో రైతుల పేర్లు, సర్వే నంబర్లు, భూసేకరణ అవసరాన్ని వివరిస్తూ నోటిఫికేషన్ (3ఏ)లో చెప్పారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు ఈ గెజిట్‌ను ప్రకటన రూపంలో విడుదల చేశారు.