Today: అంతర్జాతీయంగా అనిశ్చితితో.. భారత స్టాక్ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు కొనసాగుతున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటంతో.. మార్కెట్లలో నష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి హెవీ వెయిట్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలకు నష్టాలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. ఈ వార్త రాసే సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 450 పాయింట్లకుపైగా తగ్గడంతో 83,100 స్థాయిలో కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 150 పాయింట్లు తగ్గడంతో 25,500 మార్కు స్థాయిలో ట్రేడవుతోంది. ఇతర చాలా స్టాక్స్ కూడా పతనం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మార్కెట్లు పతనం అవుతున్న తరుణంలో . కిందటి రోజు అంటే గత శుక్రవారం సెషన్‌లో రూ. 267.45 వద్ద ముగియగా ఇవాళ ఇంట్రాడేలో దాదాపు 10 శాతం తగ్గి రూ. 241.55 వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం వార్త రాస్తున్న సమయంలో చూస్తే ఇది 8 శాతం పతనంతో రూ. 246 స్థాయిలో కదలాడుతోంది. విప్రో కంపెనీ మార్కెట్ విలువ చూస్తే ప్రస్తుతం రూ. 2.58 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 324.60 గా ఉండగా.. కనిష్ఠ ధర రూ. 228 గా ఉంది. ఏడాది వ్యవధిలో ఈ స్టాక్ 18 శాతం తగ్గగా.. ఈ ఏడాదిలో కూడా ఇప్పటివరకు 8 శాతం వరకు తగ్గింది. దీంతో విప్రో స్టాక్ ఇవాళ ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు మిగిల్చిందని చెప్పొచ్చు. శుక్రవారం రోజు ఈ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడో త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించింది. ఇక్కడ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 3119 కోట్లుగా నమోదైాంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే లాభం 7 శాతం తగ్గింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం మాత్రం స్వల్పంగా 5.5 శాతం పెరగడంతో రూ. 23,555.80 కోట్లకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కిందటి త్రైమాసికంతో (జులై- సెప్టెంబర్) పోల్చినా లాభం 3.9 శాతం వరకు తగ్గింది. ఇలాంటి బలహీన ఫలితాల నేపథ్యంలో.. పలు బ్రోకరేజీలు ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ తగ్గించేశాయి. దీంతో అమ్మకాల ఒత్తిడితో షేరు ధర భారీగా పడిపోయింది. ఇన్వెస్టర్లకు నష్టాలు మిగిల్చింది. ఐటీ కంపెనీల్లో టెక్ మహీంద్రా స్టాక్ ధర మాత్రం భారీగా పుంజుకుంది. వార్త రాసే సమయంలో దాదాపు 4 శాతం లాభంతో రూ. 1730 స్థాయిలో ఉంది.