బంగ్లాదేశ్ నో అంటే రెడీగా ఉన్న స్కాట్లాండ్.. ఇంకా క్లారిటీ ఇవ్వని ఐసీసీ!

Wait 5 sec.

తో, ప్రత్యామ్నాయ జట్టు అంశంపై చర్చలు ఊపందుకున్నాయి. జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఐసీసీ క్రికెట్ బోర్డును సంప్రదించలేదని తెలుస్తోంది.భారత్ – మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు తమ జట్టును పంపేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిరాకరిస్తోంది. భద్రతా కారణాలను చూపుతూ ముంబై, కోల్‌కతాలో జరగాల్సిన తమ గ్రూప్ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని బీసీబీ కోరింది. అంతేకాదు, శ్రీలంకలోనే అన్ని మ్యాచ్‌లు ఆడనున్న ఐర్లాండ్‌తో గ్రూప్‌ల మార్పిడి ప్రతిపాదనను కూడా బంగ్లాదేశ్ ముందుంచింది. అయితే ఈ రెండు అభ్యర్థనలను ఐసీసీ తిరస్కరించినట్లు సమాచారం.టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి మూడువారాల కన్నా తక్కువ సమయం ఉండగా కూడా, బంగ్లాదేశ్ టోర్నీలో పాల్గొంటుందా లేదా అన్నదానిపై అధికారిక ప్రకటన చేయలేదు. ఒకవేళ బంగ్లాదేశ్ తప్పుకుంటే, ర్యాంకింగ్స్ ప్రకారం తదుపరి అర్హత కలిగిన జట్టుగా స్కాట్లాండ్‌కు అవకాశం దక్కే పరిస్థితి ఉంది. అయితే ఈ విషయంలో ఐసీసీ ఇప్పటివరకు క్రికెట్ స్కాట్లాండ్‌తో ఎలాంటి అధికారిక చర్చలు ప్రారంభించలేదు. మరోవైపు, బంగ్లాదేశ్ పరిస్థితిని గౌరవిస్తూ స్కాట్లాండ్ క్రికెట్ బోర్డు కూడా స్వయంగా ఐసీసీని సంప్రదించేందుకు ఇష్టపడటం లేదని సమాచారం.గత ఏడాది జరిగిన యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్ నాలుగో స్థానంలో నిలిచి, స్వల్ప తేడాతో టీ20 వరల్డ్ కప్ అర్హతను కోల్పోయింది. నెదర్లాండ్స్, ఇటలీ జట్లు ఆ టోర్నీ నుంచి అర్హత సాధించాయి. ప్రస్తుతం స్కాట్లాండ్ జట్టు మార్చిలో నమీబియా, ఒమన్‌లతో వన్డే ట్రై సిరీస్‌కు సిద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్ తప్పుకుంటే ప్రత్యామ్నాయ జట్టును ఎలా ఎంపిక చేస్తారన్న అంశంపై బీబీసీ స్పోర్ట్స్ ఐసీసీని సంప్రదించింది. 2009 టీ20 వరల్డ్ కప్‌లో రాజకీయ కారణాలతో జింబాబ్వే తప్పుకోవడంతో అప్పట్లో ప్రీ-టోర్నీ క్వాలిఫయింగ్ పోటీల్లో నెక్స్ట్ బెస్ట్ టీమ్‌గా ఉన్న స్కాట్లాండ్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తుది నిర్ణయం తీసుకునే వరకు, టీ20 వరల్డ్ కప్‌లో వారి స్థానం విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.