జడేజాకి టైం దగ్గరపడింది.. 'అంత ఈజీ కాదు' అంటూ అశ్విన్ వార్నింగ్

Wait 5 sec.

న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తీవ్ర నిరాశ పరిచాడు. బాల్‌తో గానీ బ్యాట్‌తో గానీ రాణించలేకపోయాడు. దీనిపై మాజీ స్పిన్నర్ ఆర్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత సమయం జడేజాకు అంత ఈజీ కాదని చెప్పిన అశ్విన్.. తన ఆటలో కొంత మార్పు, ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని సూచించాడు.ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం తర్వాత జడేజా వన్డే ఫార్మాట్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇండోర్‌లో జరిగిన మూడో వన్డేలో బంతితో ప్రభావం చూపలేకపోయిన జడేజా.. ఆరు ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లోనూ కేవలం 16 పరుగులకే పరిమితమయ్యాడు. దాంతో భారత్ ఇండోర్ వన్డేలో 41 పరుగుల తేడాతో ఓడిపోయి సిరీస్‌ను కూడా 2 - 1 తేడాతో కోల్పోయింది. గత ఏడాది నుంచి ఆడిన ఆరు వన్డేల్లో జడేజా ఒక్క వికెట్ మాత్రమే సాధించగా, బౌలింగ్ సగటు ఆందోళన కలిగించే స్థాయికి చేరింది. బ్యాటింగ్‌లో పరుగులు చేసినప్పటికీ, స్ట్రయిక్ రేట్ పడిపోవడం జట్టుకు ఇబ్బందిగా మారుతోంది. ఫినిషర్ పాత్రలో ఉన్న ఆటగాడికి ఇది సరైన సంఖ్య కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.యాష్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన అశ్విన్ “ఇది జడేజాకు సవాల్‌తో కూడిన సమయం. అతని వెనుక బలంగా ఉన్నాడు. జడేజా వన్డేల్లో ఎంతో ఇచ్చాడు. కానీ ఇప్పుడు చర్చంతా అతని బ్యాటింగ్ చుట్టూనే తిరుగుతోంది. స్పిన్నర్లపై తక్కువ స్ట్రయిక్ రేట్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడే ఎవరి భవిష్యత్తుపై తీర్పు ఇవ్వడం తొందరపాటు” అని అన్నాడు. “అతని బలాలే కొన్నిసార్లు అతని బలహీనతలుగా మారుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ – మూడు విభాగాల్లో అతనికున్న నైపుణ్యం అసాధారణం. కానీ కొత్త ప్రయోగాలు చేయడు. నెట్స్‌లో కేరమ్ బాల్ వేస్తాడు, కానీ మ్యాచ్‌లో మాత్రం ప్రయత్నించడు. లెజెండ్ అయిన అతనికి కోల్పోయేదేమీ లేదు. కొంచెం ఫంకీగా ఆడితే చూడాలని ఉంది” అని అశ్విన్ చెప్పాడు.