ఏపీలో మహిళలు స్త్రీ శక్తి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. మహిళా ప్రయాణికులతో బస్సులు రద్దీగా మారాయి. అయితే ఓ మహిళ మాత్రం ఈ రద్దీని అవకాశంగా తీసుకుని కక్కుర్తి పడింది.. కండక్టర్ అలర్ట్‌గా ఉండటంతో ఆమె ఘనకార్యం బయటపడింది. కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలో బనగానపల్లె వెళ్తున్న ఆర్టీసీ బస్సులో కండక్టర్ దగ్గర ఉన్న డబ్బుల్ని ఒక మహిళా ప్రయాణికురాలు దొంగిలించింది. నగదు పోయినట్లు గుర్తించిన కండక్టర్ అలర్ట్ కాగా.. పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేసి, ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. కండక్టర్ ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదు చేశారు.బనగానపల్లెకు వెళ్తున్న లో కండక్టర్ తన వద్ద ఉన్న డబ్బును లెక్కించుకుంటుండగా.. అందులోంచి రూ. 6570 మాయమైంది. దీంతో కండక్టర్ కంగారు పడ్డారు. డబ్బు పోయిన విషయాన్ని గుర్తించిన కండక్టర్ వెంటనే బస్సును దగ్గరలోని పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. పోలీసులు బస్సు ఎక్కి ప్రయాణికులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా, కండక్టర్ దగ్గర నుంచి డబ్బును దొంగిలించిన మహిళా ప్రయాణికురాలిని పోలీసులు గుర్తించారు. కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు ఆ మహిళా ప్రయాణికురాలిపై కేసు నమోదు చేశారు. దొంగిలించిన డబ్బును స్వాధీనం చేసుకునే ప్రక్రియలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాలలో సంక్రాంతి పండుగ సందర్భంగాభారీగా ఆదాయం వచ్చింది. ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా సుమారు రూ.50 లక్షలు ఆర్జించినట్లు ఆర్టీసీ ఆర్‌ఎం రజియా సుల్తానా తెలిపారు. 150 ప్రత్యేక బస్సుల్ని ఈ నెల 8 నుంచి 19 వరకు జిల్లా వ్యాప్తంగా నడిపారు. జిల్లా కేంద్రంలోనే వీటిలో 83 బస్సులు తిరిగాయి. ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. అంతేకాద ఈ సంక్రాంతి పండుగ సమయంలో మహిళలు 'స్ర్తీ శక్తి' పథకం కింద ఎక్కువగా ప్రయాణించారు. జిల్లాలో దాదాపు 7 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు చెబుతున్నారు. సంక్రాంతికి ఈ ఉచిత ప్రయాణాల వల్ల ఆర్టీసీకి సుమారు రూ.3 కోట్ల వరకు ఖర్చయినట్లు అంచనా వేస్తు్న్నారు.