‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాపై మోహన్ బాబు.. వీళ్లు మారరు.. కావాలనే పెద్దాయన్ని కెలికారు!

Wait 5 sec.

విలక్షణ నటుడు సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 500కి పైగా సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓ పేజీని లఖించుకున్నారు. ఇక సినిమాలతో పాటుగా అప్పుడప్పుడు వివాదాలతోనూ మోహన్ బాబు వార్తల్లో నిలుస్తుంటారు. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు కొన్నాళ్లపాటు హాట్ టాపిక్ గా నడిచాయి. ఇప్పుడిప్పుడే అవన్నీ పక్కనపెట్టి మోహన్ బాబు మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాయి. అయితే కొన్ని మీడియాలు అత్యుత్సాహంతో ఆయన్ని వివాదాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు.మంచు ఫ్యామిలీలో వివాదం అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా నడిచింది. మనోజ్ ఒకవైపు.. మోహన్ బాబు, విష్ణు మరోవైపు అన్నట్లుగా ఘర్షణ పడ్డారు. విష్ణు, మనోజ్ ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవడం.. మనోజ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి రచ్చ చేయడం.. ఇద్దరూ కేసులు పెట్టుకోవడంతో కుటుంబ తగాదా రోడ్డుకెక్కింది. ఆ తర్వాత జల్ పల్లి ఇంట్లో మొదలైన గొడవ కాస్తా తిరుపతి వరకూ చేరింది. మనోజ్ తో ఘర్షణ జరుగుతున్న సమయంలో ఓ మీడియా ప్రతినిధి మోహన్ బాబు ఇంట్లోకి ప్రవేశించి ఆయన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయడం, సంయమనం కోల్పోయిన మోహన్ బాబు మైక్ తీసుకొని ఆ రిపోర్టర్ పై దాడి చేయడం, ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోదవ్వడం, మోహన్ బాబు కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటం, బయటకు వచ్చి మీడియా ప్రతినిధికి క్షమాపణలు చెప్పి భరోసా ఇవ్వడం.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి.అయితే గత కొన్ని నెలలుగా మంచు ఫ్యామిలీలో అందరూ సైలెంట్ గా ఉంటున్నారు. ఎవరి పనులతో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. సోదరుడు విష్ణు సినిమాలకు మనోజ్ శుభాకాంక్షలు చెప్పడంతో, అన్నదమ్ముల మధ్య ఇప్పుడంతా బాగానే ఉందనే టాక్ నడిచింది. మరోవైపు మోహన్ బాబు సైతం సినిమాలతో బిజీ అయిపోయారు. కెరీర్ ప్రారంభంలో తనకు పేరు తెచ్చిపెట్టిన విలన్ పాత్రలు చేయడానికి రెడీ అయిపోయారు. నాని హీరోగా నటిస్తున్న 'ది ప్యారడైజ్’ మూవీలో ఆయన ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఈ మధ్యనే తన చిరకాల మిత్రుడు రజనీకాంత్ తో సహా ఇండస్ట్రీలోని తన శ్రేయోభిలాషులందరినీ పిలిచి గ్రాండ్ గా 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అదే విధంగా ఇప్పుడు సంక్రాంతి పండగను కూడా జరుపుకున్నారు.మోహన్ బాబు ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ప్రాంగణం లో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి భోగి మంటలు వెలిగించారు. సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి అనేది పండుగ మాత్రమే కాదని, మన సంస్కృతిని ఆచారాలను గౌరవించుకునే గొప్ప సందర్భమని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.అయితే ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి ప్రస్తుత రాజకీయాల గురించి ప్రశ్నించగా.. పండగ రోజు పాలిటిక్స్ వద్దు, అందరికీ శుభం జరగాలని కోరుకుందామని మోహన్ బాబు బదులిచ్చారు. “మీ మిత్రుడు నటించిన సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. మీరు ఏం చెప్తారు?” అని అడగ్గా.. “నేను ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడను. భోగి గురించే మాట్లాడతాను. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని మోహన్ బాబు అన్నారు. నిజానికి అది '' సినిమా గురించి మాట్లాడుకునే సందర్భం కాదు. కావాలనే చిరంజీవి సినిమాపై ఆయన్ను ప్రశ్నించారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.టాలీవుడ్ లో సూపర్ సీనియర్ హీరోలైన చిరంజీవి - మోహన్ బాబు మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. ఆన్ స్క్రీన్ లో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ.. ఆఫ్ స్క్రీన్ లో మాత్రం మిత్రులో, శత్రువులో అర్థంకాని విధంగా ప్రవర్తించేవారు. అప్పుడే ఇద్దరూ పబ్లిక్ గా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటారు.. అంతలోనే కౌగిలించుకొని ఒకటౌతారు. గత కొన్ని దశాబ్దాలుగా వారి మధ్య ఇలాంటి అనుబంధమే కొనసాగింది. 'సన్నాఫ్ ఇండియా' మూవీ టైంలో కోల్డ్ వార్ కి స్వ‌స్థి పలికి ఇద్దరూ కలిసిపోయారు. కానీ మంచు విష్ణు 'మా' అధ్యక్షుడుగా పోటీ చేసిన సమయంలో, ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ వర్గానికి మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత చిరు - మోహన్ బాబు కలిసి కనిపించలేదు.ఫ్యామిలీలో గొడవల తర్వాత ఇప్పుడిప్పుడే మోహన్ బాబు మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారు. అయితే అనవసరంగా ఆయన్ను వివాదాల్లోకి లాగడానికి ఇప్పుడు కావాలనే ఇలా 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీ గురించి ప్రశ్నలు అడిగారని నెటిజన్లు భావిస్తున్నారు. చిరంజీవి సినిమాపై మోహన్ బాబు ఏదైనా కామెంట్ చేస్తే అది వైరల్ అవుతుందని, సందర్భం కాకపోయినా అత్యుత్సాహంతో ఇటువంటి ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.