2026 సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులకు వేదికైంది. ఈసారి బాక్సాఫీస్ వద్ద ఏకంగా 5 చిత్రాలు పోటీ పడ్డాయి. మెగాస్టార్ నుంచి యంగ్ స్టర్స్ వరకు ప్రతి ఒక్కరూ తమ సినిమానే పర్ఫెక్ట్ 'సంక్రాంతి బొమ్మ' అంటూ రంగంలోకి దిగారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్, హారర్ ఫాంటసీ, కామెడీ డ్రామాలు.. ఇలా పలు రకాల జోనర్లలో రూపొందిన సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. జనవరి 9 నుండి 14 మధ్య విడుదలైన ఈ ఐదు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుండటం విశేషం. వీటిల్లో ఏ సినిమాకి ఎలాంటి ప్రేక్షకాదరణ ఉందో చూద్దాం. 'ది రాజాసాబ్'సంక్రాంతి బరిలో అందరి కంటే ముందొచ్చిన సినిమా 'ది రాజాసాబ్'. హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో రూపొందింది. భారీ అంచనాలతో జనవరి 9న థియేటర్లలోకి వచ్చింది. హారర్-కామెడీ-ఫాంటసీ జానర్‌లో మారుతి చేసిన ఈ ప్రయోగం మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ప్రభాస్ స్టార్ పవర్ వల్ల భారీ ఓపెనింగ్స్ సాధించింది. 4 రోజుల్లోనే ₹201 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. క్లైమాక్స్, విజువల్స్ బాగున్నాయని కొందరు అంటే, స్క్రీన్ ప్లే ఇంకా బలంగా ఉండాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. మిశ్రమ స్పందనలు రావడంతో రేసులో కాస్త వెనుకబడిపోయింది. అయినప్పటికీ వసూళ్లు రాబడుతోంది.'మన శంకర వరప్రసాద్ గారు'మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ''. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. జనవరి 12న రిలీజైన ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా 100% సక్సెస్ అయింది. చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌, డ్యాన్సులను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా రెండు రోజుల్లోనే ₹120 కోట్ల వసూళ్లను సాధించింది. అంచనాలకు మించిన బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఫెస్టివల్ సీజన్ లో ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తున్నారు. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. రానున్న రోజుల్లో భారీ వసూళ్లు ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'మాస్ మహారాజా రవితేజ తన ట్యాగ్ ని పక్కనపెట్టి చేసిన సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందింది. జనవరి 13న విడుదలైంది. అటు భార్య, ఇటు ప్రేయసి మధ్య నలిగిపోయే హీరో కథాంశంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకొని చేసిన సినిమా ఇది. కిశోర్ తిరుమల మార్క్ కామెడీ, ఎమోషన్స్.. రవితేజ ఎనర్జీ ఈ చిత్రానికి బలం. యునానిమస్ టాక్ రాకపోయినా రవితేజ గత చిత్రాలతో పోలిస్తే చాలా మెరగనే మాట బయటికి రావడంతో ఆక్యుపెన్సీ పెరుగుతోంది. మాస్ సినిమాలకు భిన్నంగా రవితేజ చేసిన ఈ ప్రయత్నం.. బీ, సీ సెంటర్లలో మంచి వసూళ్లను రాబడుతోంది. 'అనగనగా ఒక రాజు'నవీన్‌ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన సినిమా ‘అనగనగా ఒక రాజు’. మారి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం.. నవీన్ మార్క్ కామెడీతో అలరిస్తోంది. వన్ మ్యాన్ షో చూపించిన నవీన్.. తన వన్ లైనర్స్ తో కడుపుబ్బ నవ్వించారు. చివర్లో ఎమోషనల్ సీన్స్ తో కన్నీళ్లు తెప్పించారు. సంక్రాంతికి సరైన కంటెంట్ అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో, జనాలు ఈ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. యుఎస్ఏలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.'నారీ నారీ నడుమ మురారి'ఈ ఏడాది సంక్రాంతి సీజన్ లో చివరగా వచ్చిన సినిమా 'నారీ నారీ నడుమ మురారి'. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. జనవరి 14న సాయంత్రం షోలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాస్ట్ బాల్ సిక్సర్ అన్నట్లుగా చివర్లో వచ్చి యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఒక కొత్త పాయింట్‌తో వినోదాత్మకంగా రూపొందించిన ఈ సినిమాని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. శర్వా చాలా కాలం తర్వాత తన మార్క్ కామెడీతో అలరించారు. శ్రీవిష్ణు క్యామియో, నరేష్, వెన్నెల కిషోర్, సత్యల కామెడీ సినిమాను క్లీన్ హిట్ జోన్‌లోకి తీసుకెళ్లింది.ఇలా ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగిన ఐదు చిత్రాల్లో 'మన శంకర వరప్రసాద్ గారు' ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ట్రెండ్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద పొంగల్ విన్నర్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని తర్వాత 'నారీ నారీ నడుమ మురారి' సినిమాకి ఆడియన్స్ ఓటేస్తున్నారు. 'అనగనగా ఒక రాజు' మూవీ మూడో ప్రాధాన్యతగా నిలిచింది. ఆ తర్వాత 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'.. ఆఖరిగా 'ది రాజాసాబ్' సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఏదేమైనా ఈ సంక్రాంతి టాలీవుడ్ కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. చాలా ఏళ్ల తర్వాత సినీ సందడి కనిపిస్తోంది. ఐదుకి ఐదూ మంచి వసూళ్లను రాబడుతున్నాయి. మరి వీటిల్లో మీకు ఏయే సినిమాలు నచ్చాయో కామెంట్ చేయండి.