ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఏ స్థాయి వారికి బేసిక్ పే ఎంత పెరగొచ్చు.. లెక్కలివే!

Wait 5 sec.

8th Pay Commission Increase: 7వ వేతన సంఘం గడువు 2025, డిసెంబర్ 31తోనే ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2026, జనవరి 1 నే అమలు కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యం అవుతోంది. మరో 1-2 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. గతేడాది జనవరిలోనే దీని ఏర్పాటు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ.. నవంబరులో కానీ విధివిధానాలకు ఆమోదం లభించలేదు. దీంతో అప్పటినుంచి వేతన కమిషన్‌కు.. సిఫార్సులు రూపొందించేందుకు 18 నెలల సమయం ఉంటుంది. మళ్లీ దీనికి కేంద్రం ఆమోదం లభిస్తే.. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తుంది. వేతన సంఘం అనేది.. చేస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల ప్రాథమిక వేతనాన్ని (బేసిక్ పే) నిర్ణయించడం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కరవు భత్యం (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) వంటి వాటిని సిఫార్సు చేస్తుంది. ఇంకా రిటైర్ అయిన వారికి పెన్షన్ ప్రయోజనాల్ని సమీక్షిస్తుంది.ఇక్కడ వేతన సంఘాల్లో.. బేసిక్ పేను పెంచేందుకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ప్రామాణికంగా తీసుకుంటుంటారు. ఇదే బేసిక్ పే ఎన్ని రెట్లు పెరుగుతుందో నిర్ణయిస్తుంది. ఇక బేసిక్ పే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి స్థాయిని (లెవెల్‌) బట్టి ఉంటుందని చెప్పొచ్చు. 6వ వేతన సంఘంలో 1.92 రెట్లు ఉండగా.. బేసిక్ పే ఇదే స్థాయిలో పెరిగింది. 7వ వేతన సంఘంలో 2.57 గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను నిర్ణయించారు. ఇక్కడ ఉద్యోగి లెవెల్‌ను బట్టి బేసిక్ పే ఎలా ఉంది.. ఎలా పెరిగిందో చూద్దాం. ఇప్పుడు ఆల్ ఇండియా NPS ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రకారం.. 8వ వేతన సంఘం ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.13 గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 7వ వేతన సంఘంలో మినిమం బేసిక్ పే లెవెల్-1 నుంచి లెవెల్ -5 వరకు ఉద్యోగులకు ఎలా ఉందో చూద్దాం. లెవెల్ 1 ఉద్యోగుల ప్రాథమిక వేతనం రూ. 18 వేలుగా ఉండగా.. లెవెల్ 2, 3 ఉద్యోగులకు వరుసగా ఇది రూ. 19,900; రూ. 21,700 గా ఉంది. లెవెల్ 4,5 ఉద్యోగులకు చూస్తే రూ. 25500, రూ. 29200 గా ఉంది. 8వ వేతన సంఘంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.92 గా ఉంటే.. బేసిక్ పే ఉద్యోగులకు ఎంత పెరుగుతుందో కింద టేబుల్‌లో చూద్దాం.ఉద్యోగి స్థాయిమినిమం బేసిక్ పే (1.92 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్)1రూ. 34,6502రూ. 38,2083రూ. 41,6644రూ. 48,9605రూ. 56,064అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.15 గా అంచనా వేస్తే.. బేసిక్ పే ఇలా పెరుగుతుంది.ఉద్యోగి స్థాయిమినిమం బేసిక్ పే (2.15 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్)1రూ. 38,7002రూ. 42,7853రూ. 46,6554రూ. 54,8255రూ. 62,780ఒకవేళ మరోసారి 2.57 గా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే.. ఇక్కడ లెవెల్ 1 నుంచి లెవెల్ 5 ఉద్యోగుల బేసిక్ పే (ప్రాథమిక వేతనం) ఎలా ఉంటుందో కింద పట్టికలో చూద్దాం. ఉద్యోగి స్థాయిమినిమం బేసిక్ పే (ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57)1రూ. 46,2602రూ. 51,1433రూ. 55,7694రూ. 65,5355రూ. 75,044