పోస్టాఫీస్ గొప్ప స్కీమ్.. లక్షకు 2 లక్షలు.. 5 లక్షలకు 10 లక్షలు.. కేంద్రం మద్దతుతో గ్యారెంటీ రిటర్న్స్!

Wait 5 sec.

: కాలం గడుస్తున్న కొద్దీ.. రోజువారీ ఇంటి ఖర్చులు పెరిగిపోతున్నాయి. పొదుపు తగ్గిపోతోంది. ఇలా అయితే భవిష్యత్తులో జీవించడం కష్టంగా మారుతుందని చెప్పొచ్చు. అందుకే జాగ్రత్తగా డబ్బును ఖర్చు పెట్టాలి. అదే విధంగా పొదుపు అలవర్చుకోవాలి. ఇంకా భవిష్యత్తు కోసం పొదుపు చేసిన దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకోసం మీ స్థోమతను బట్టి రిస్క్ ఉన్న పెట్టుబడి సాధనాలా లేదా రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్స్ ఇచ్చే పథకాలా అని ఆలోచించాలి. ఇక్కడ కేవలం మీ డబ్బు సురక్షితమే కాదు.. దీర్ఘకాలంలో కచ్చితంగా మీ పెట్టుబడిని రెట్టింపు చేస్తుంది. ఇదే కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న . ఈ పథకాలనే పోస్టాఫీస్ స్కీమ్స్ లేదా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అంటారు. వీటిల్లో ఎలాంటి రిస్క్ ఉండదు. నిర్దిష్ట కాల పరిమితికి.. మీ పెట్టుబడిపై నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం రాబడి వస్తుంది. ఈ కిసాన్ వికాస్ పత్ర విషయానికి వస్తే ఇదో ప్రత్యేక పథకం. ఇక్కడ ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం కచ్చితంగా 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో మీ పెట్టుబడి డబుల్ అవుతుంది. ఎంత పెడితే దానికి రెట్టింపు మీ చేతికి వస్తాయన్నమాట. ఉదాహరణకు మీరు రూ. 1 లక్ష జమ చేస్తే.. 115 నెలల్లో అది రూ. 2 లక్షలు అవుతుంది. అదే రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. 115 నెలల్లో అదే 10 లక్షలవుతుంది. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ల మాదిరిగా ఇక్కడ ఎలాంటి రిస్క్ ఉండదు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరోసా ఉంటుంది. సామాన్యులకు కూడా అవకాశం ఉంది. అందుకే చాలా మందికి ఈ స్కీమ్ ఫస్ట్ ఆప్షన్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 7.5 శాతంగా ఉంది. దీనిని కేంద్రం ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. చాలా కాలంగా మాత్రం స్థిరంగానే ఉంచుతూ వస్తోంది. ఈ వడ్డీ రేట్లు మారితే.. రిటర్న్స్‌పై ప్రభావం పడుతుంది. అంటే వడ్డీ రేటు పెరిగితే.. ఇంకా తక్కువ కాలంలోనే మీ పెట్టుబడి డబుల్ అవుతుందని చెప్పొచ్చు. 18 ఏళ్లు నిండిన భారతీయులు ఎవరైనా ఈ పథకంలో చేరొచ్చు. మైనర్ పేరిట కూడా గార్డియెన్స్ అకౌంట్ తెరవొచ్చు. కనీసం రూ. 1000 నుంచి ప్రారంభ పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠ పెట్టుబడి పరిమితి ఏం లేదు. అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. వ్యక్తిగతంగా ఒక్కరు లేదా గరిష్ఠంగా ముగ్గురు కలిసి ఖాతా తెరవొచ్చు. ఇంకా నామినీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కిసాన్ వికాస్ పత్ర పథకంలో చేరాలంటే దగ్గర్లోని పోస్టాఫీస్ లేదా కమర్షియల్ బ్యాంకుల్ని సంప్రదించొచ్చు. పెట్టుబడి పెట్టిన రెండేళ్ల 6 నెలల తర్వాత కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మెచ్యూరిటీకి ముందు మీ డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. కాస్త ముందు తీసుకోవాలంటే మాత్రం వడ్డీ తగ్గుతుంది. పెనాల్టీ పడుతుందని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో టాక్స్ బెనిఫిట్స్ ఉండవు.