ట్రైన్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. స్లీపర్ టికెట్‌తో థర్డ్ ఏసీ రైలు ప్రయాణం..!

Wait 5 sec.

ట్రైన్ ప్రయాణికులకు అందించింది. కాచిగూడ - రేపల్లె మధ్య నడిచే ప్రయాణికులకు ఊహించని అదృష్టం వరించింది. సాధారణంగా స్లీపర్ క్లాస్ టికెట్ ధరతో ఏసీ కోచ్‌లో ప్రయాణించడం ఎవరికైనా కలగానే ఉంటుంది.. కానీ డెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన వందలాది మంది ప్రయాణికులకు ఇది నిజమైంది. రైల్వే శాఖ తీసుకున్న సాంకేతిక మార్పుల వల్ల రెండు పూర్తి స్లీపర్ కోచ్‌ల ప్రయాణికులు ఎటువంటి అదనపు రుసుము చెల్లించకుండానే థర్డ్ ఏసీ (3AC) బోగీలలో విలాసవంతంగా ప్రయాణించారు.ఐసీఎఫ్ నుంచి ఎల్‌హెచ్‌బీకి మార్పుడెల్టా ఎక్స్‌ప్రెస్‌లో ఇప్పటివరకు ఉండేవి. అయితే ప్రయాణికుల భద్రత, వేగాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ తాజాగా వీటిని అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లుగా మార్చింది. ఈ మార్పు వల్ల రైలు ప్రయాణం మరింత సురక్షితంగా.. కుదుపులు లేకుండా సాగుతుంది. అయితే ఈ మార్పు సమయంలో ఒక సాంకేతిక సమస్య ఎదురైంది. పాత ఐసీఎఫ్ రైలులో స్లీపర్ కోచ్‌ల సంఖ్య ఎక్కువగా ఉండగా.. కొత్త ఎల్‌హెచ్‌బీ రేక్ లో స్లీపర్ కోచ్‌లు తగ్గి, థర్డ్ ఏసీ కోచ్‌ల సంఖ్య పెరిగింది.రైలు రిజర్వేషన్లు 60 రోజుల ముందే ప్రారంభమవుతాయి. దీంతో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల మార్పు కంటే ముందే చాలా మంది స్లీపర్ క్లాస్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారు. కోచ్‌ల మార్పు తర్వాత, స్లీపర్ క్లాస్‌లో బెర్తులు దొరకని సుమారు రెండు కోచ్‌ల ప్రయాణికులను రైల్వే శాఖ ఉచితంగా థర్డ్ ఏసీకి అప్‌గ్రేడ్ చేసింది. శుక్రవారం నాడు ప్రయాణించిన వారంతా స్లీపర్ టికెట్ ధరతోనే ఏసీ సౌకర్యాలతో ప్రయాణించారు. సాధారణంగా 'ఆటో అప్‌గ్రేడేషన్' ఆప్షన్ ఎంచుకున్న కొద్దిమందికి మాత్రమే ఇలాంటి అవకాశం దక్కుతుంది, కానీ ఇక్కడ రెండు పూర్తి కోచ్‌లకే ఈ లక్ దక్కింది.కొత్తగా ప్రవేశపెట్టిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కేవలం సౌకర్యవంతమే కాదు, ప్రమాదాల సమయంలో ఒకదానిపై ఒకటి ఎక్కకుండా ఉండే 'యాంటీ క్లైంబింగ్' ఫీచర్‌ను కలిగి ఉంటాయి. వీటిలో పెద్ద కిటికీలు, బయో-టాయిలెట్లు, మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది. ఈ మార్పుల వల్ల భవిష్యత్తులో స్లీపర్ ప్రయాణికులకు బెర్తుల సంఖ్య కొంత తగ్గినప్పటికీ, రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం కోసం ఇలాంటి అప్‌గ్రేడ్ నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం.