Stock Split: మిడ్ క్యాప్ కేటగిరిలోని ట్రేడింగ్ సెక్టార్ కంపెనీ ఏంజెల్ వన్ లిమిటెడ్ (Angel One Limited) తమ షేర్ హోల్డర్లకు డబుల్ బొనాంజా ప్రకటించింది. 2026 ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు తాజాగా ప్రకటించింది. ఈ సందర్బంగా ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 23 చొప్పున మధ్యంతర డివిడెంట్ చెల్లింపుతో పాటు స్టాక్ స్ప్లిట్‌కి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్లు వెల్లడించింది. ఈ డివిడెండ్, కి రికార్డు డేట్ జనవరి 21గా నిర్ణయించినట్లు తెలిపింది. మరోవైపు ఈ షేరు ఏడాదిలో 10 శాతం మాత్రమే లాభపడింది.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం జనవరి 15న జరిగిన కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో 2026 ఆర్థిక సంవత్సరం ఈ డివిడెండ్ రికార్డ్ డేట్ జనవరి 21గా నిర్ణయించారు. మరోవైపు అదే రోజు 1:10 రేషియోలో స్టాక్ స్ప్లిట్‌ చేపట్టేందుకు ఆమోదం తెలిపారు. దీని అర్థం రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక ఈక్విటీ షేరుని రూ. 1 ఫేస్ వ్యాల్యూ ఉండే 10 ఈక్విటీ షేర్లుగా విభజిస్తారు. అయితే ఈ స్టాక్ స్ప్లిట్ కంపెనీ వాటాదారుల ఆమోదానికి లోబడి ఉంటుంది. ఈ స్టాక్ స్ప్లిట్ రికార్డు డేట్ సైతం జనవరి 21, 2026 గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. చివరి ట్రేడింగ్ సెషన్లో ఏంజెల్ వన్ లిమిటెడ్ షేరు 3.27 శాతం లాభంతో రూ. 2519 వద్ద ముగిసింది. ఈరోజు 8 శాతం మేర దూసుకెళ్లింది. దీంతో ఈ వార్త రాసే సమయానికి రూ. 2732 వద్ద ట్రేడవుతోంది. గత ఒక వారం రోజుల్లో ఈ షేరు 18 శాతం లాభాన్ని అందించింది. గత నెల రోజుల్లో 8 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 1 శాతం పెరిగింది. గత ఏడాది కాలంలో 10 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఐదు సంవత్సరాల్లో 124 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 24,830 కోట్లుగా ఉంది.