బెగ్గర్ కాదు, స్లమ్‌ డాగ్‌.. ‘పూరి-సేతుపతి’ ఫస్ట్‌ లుక్‌ రిలీజ్..

Wait 5 sec.

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. టబు, దునియా విజయ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘పూరి సేతుపతి’ (Puri Sethupathi) అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇవాళ (జనవరి 16) విజయ్‌ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ తో పాటుగా టైటిల్ ను ప్రకటించారు. పూరి జగన్నాథ్‌ - విజయ్‌ సేతుపతి సినిమాకి 'బెగ్గర్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి చివరకు ‘స్లమ్‌ డాగ్‌’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘33 టెంపుల్‌ రోడ్‌’ అనే ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఫస్ లుక్ పోస్టర్‌లో విజయ్‌ సేతుపతి డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. బిచ్చగాడి వస్త్రధారణలో కళ్లజోడు పెట్టుకొని, చేతిలో రక్తంతో తడిచిన కత్తి పట్టుకొని పవర్‌ఫుల్‌గా ఉన్నారు. బ్యాగ్రౌండ్ లో చెల్లాచెదురుగా పది ఉన్న డబ్బు కట్టలను మనం గమనించవచ్చు. * ‘స్లమ్‌ డాగ్‌ - 33 టెంపుల్‌ రోడ్‌’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ ఆసక్తికర క్యాప్షన్‌ను షేర్‌ చేశారు. ''మురికివాడల నుంచి.. ఎవరూ ఆపలేని తుఫాను ఉద్భవిస్తుంది.. అది చాలా క్రూరంగా, నిర్ధాక్షిణంగా, వాస్తవికంగా ఉంటుంది'' అని పేర్కొన్నారు. ఈ క్యాప్షన్‌ సినిమాలో విజయ్‌ సేతుపతి పాత్ర ఎంత భయంకరంగా ఉంటుందనేది తెలియజేస్తోంది. దానికి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ ఉంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ కలిసి ‘స్లమ్‌ డాగ్‌ - 33 టెంపుల్‌ రోడ్‌’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేబీ మోషన్ పిక్చర్స్ జేబీ నారాయణరావు నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. 'యానిమల్' మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా పలు ప్రధాన భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ()