తెలంగాణ రాష్ట్ర క్రీడా రంగంలో నూతన శకాన్ని ఆవిష్కరిస్తూ.. జరిగిన లో ‘ముఖ్యమంత్రి కప్ 2025’ (CM's Cup 2025) రెండో దశను ఘనంగా ప్రారంభించారు. ‘గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు – ఛాంపియన్ల తయారీ’ అనే నినాదంతో రూపొందించిన ఈ క్రీడల లోగో, బ్రోచర్, క్రీడా దుస్తులను ఆయన ఆవిష్కరించారు. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన క్రీడా విజన్ లో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు.ఐదు అంచెల క్రీడా సంబరం.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు ఈ పోటీలను ఐదు స్థాయిలలో ప్రభుత్వం నిర్వహిస్తోంది. మొత్తం 46 రకాల క్రీడాంశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.పంచాయతీ స్థాయి: జనవరి 17 నుండి 22 వరకు.మండల మరియు మున్సిపల్ స్థాయి: జనవరి 28 నుండి 31 వరకు.నియోజకవర్గ స్థాయి: ఫిబ్రవరి 3 నుండి 5 వరకు.జిల్లా స్థాయి: ఫిబ్రవరి 9 నుండి 12 వరకు.రాష్ట్ర స్థాయి: ఫిబ్రవరి 20 నుండి 23 వరకు.సాంకేతికతతో పారదర్శకత..ఈ ఏడాది ముఖ్యమంత్రి కప్ పోటీలలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ప్రతి క్రీడాకారుడికి ప్రత్యేక డిజిటల్ గుర్తింపు కార్డులను (Digital Player ID) కేటాయించారు. కృత్రిమ మేధ (AI) సాయంతో క్రీడాకారుల ప్రదర్శనను పర్యవేక్షించడం, 'టి-గేమ్స్' (T-GAMES) యాప్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారం, క్రీడాకారుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడం వంటి వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టారు. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా.. ప్రతిభ ఉన్న క్రీడాకారులను దీర్ఘకాలికంగా పర్యవేక్షించడానికి వీలవుతుంది.గ్రామీణ ప్రతిభకు ప్రపంచ వేదిక...తెలంగాణను క్రీడల హబ్‌గా మార్చాలనే సంకల్పంతో ప్రభుత్వం క్రీడా రంగానికి భారీ నిధులను కేటాయిస్తోంది. కేవలం క్రీడలే కాకుండా.. క్రీడా విజ్ఞానం (Sports Science), క్రీడా విద్య అండ్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా క్రీడాకారులు, దివ్యాంగ క్రీడాకారులను (Para Sports) ప్రోత్సహించేందుకు ఈ వేదిక ఎంతో ఉపయోగపడనుంది. క్రీడాకారులకు పౌష్టికాహారం, మెరుగైన వసతులు కల్పించేలా జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) చైర్మన్ శివసేన, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ క్రీడల ద్వారా ఎంపికైన ఉత్తమ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 'యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ'లో ఉన్నత స్థాయి శిక్షణ అందించనున్నారు.