గతేడాది డిసెంబరు నెలలో వేలాదిగా దేశీయ విమాన ప్రయాణికులు మాత్రమే కాకుండా.. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వంతోపాటు.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఫైన్ వేసింది. తప్పుడు ప్రణాళికలు, నిర్వహణ లోపాలు, నిబంధనల ఉల్లంఘనలే ఈ సంక్షోభానికి కారణమని డీజీసీఏ నిర్వహించిన దర్యాప్తులో తేలింది.2025 డిసెంబర్ 3వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ మధ్య ఇండిగో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఏకంగా 2,507 విమాన సర్వీసులు రద్దు చేశారు. 1852 విమానాలు ఆలస్యంగా నడిచాయి. సుమారు 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు దేశవ్యాప్తంగా వివిధ ఎయిర్‌పోర్టుల్లో రోజుల తరబడి చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు.కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల విచారణ కమిటీ ఇండిగో సంస్థకు సంబంధించి పలు లోపాలను గుర్తించింది. తక్కువ వనరులతో ఎక్కువ విమానాలను నడపడానికి ఇండిగో సంస్థ ప్రయత్నించిందని తేల్చారు. విమాన షెడ్యూలింగ్, సిబ్బంది కేటాయింపులో సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు విఫలం అయ్యాయని గుర్తించారు. సంక్షోభ సమయంలో ఇండిగో మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయాలు తీసుకోలేదని కమిటీ తెలిపింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో నిబంధనల ప్రకారం ఇండిగో సంస్థ సిద్ధంగా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని పేర్కొంది.ఇండిగో స్పందనఇండిగో మాతృ సంస్థ అయిన ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డీజీసీఏ ఆదేశాలను ధృవీకరించారు. తమ అంతర్గత ప్రక్రియల బలాబలాలపై లోతైన సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 19 ఏళ్ల ఇండిగో సంస్థ తమ ట్రాక్ రికార్డ్‌లో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ప్రయాణికులకు, వాటాదారులకు హామీ ఇచ్చింది.