ఇన్వెస్టర్లకు శుభవార్త.. కోకాకోలా నుంచి కూడా ఐపీఓ వచ్చేస్తుంది.. టార్గెట్ రూ. 9 వేల కోట్లు!

Wait 5 sec.

: స్టాక్ మార్కెట్లలో ఐపీఓలకు ఉండే డిమాండే వేరు. ఇవి ఎక్కువగా లిస్టింగ్ గెయిన్స్ ఆఫర్ చేస్తుంటాయని చెప్పొచ్చు. అందుకే వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు జనాలు విపరీతమైన ఆసక్తి చూపిస్తుంటారు. ప్రముఖ కంపెనీల నుంచి వచ్చే ఐపీఓలకు ఇంకా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో షేర్లను కొనుగోలు చేసేందుకు ఎగబడతారని చెప్పొచ్చు. అందుబాటులో ఉన్న షేర్ల కంటే ఎన్నో రెట్ల షేర్లకు బిడ్స్ దాఖలు చేస్తుంటారు. ముందుగా బిడ్స్ దాఖలు చేసిన వారిలో ఏ కొందరికో షేర్లు అలాట్ అవుతాయి. ఇక అది మంచి ప్రీమియంతో లిస్టయిందా.. వారికి పండగే. అంటే ఎలాంటి కష్టం లేకుండా మంచి లాభాలు అందుకోవచ్చు. దీర్ఘకాలంలో అలాగే కొనసాగిస్తే ఇంకా ఎక్కువ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గతేడాది ఆఖరి 2-3 నెలల్లో పలు ఐపీఓలు స్టాక్ మార్కెట్లలో లిస్టయ్యాయి. ఇప్పుడు 2026 సంవత్సరం కూడా అందుకు మినహాయింపేం కాదు. ఇంకా ఈ ఏడాదిలో మరిన్ని పెద్ద కంపెనీల నుంచి ఐపీఓలు రాబోతున్నాయి. ఇందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం సంస్థ , జెప్టో ఇలా పెద్ద పెద్ద కంపెనీల ఐపీఓలు లైన్‌లో ఉన్నాయి. ఇప్పుడు మరో ప్రముఖ సంస్థ కూడా కోసం సంకేతాలు ఇచ్చింది. అది కూడా ప్రముఖ అమెరికన్ మల్టీనేషనల్ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ నుంచి వస్తుండటం విశేషం. కోకా- కోలాకు చెందిన ఇండియన్ బాట్లింగ్ కంపెనీ హిందుస్తాన్ కోకా కోలా బేవరేజెస్ లిమిటెడ్. ఈ మేరకు ఈ వ్యవహారం గురించి వ్యక్తులు వెల్లడించారు. ఐపీఓ ద్వారా సుమారు 1 బిలియన్ డాలర్ల వరకు నిధుల్ని సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఇది భారత కరెన్సీలో రూ. 9027 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పటికే ఈ ఐపీఓ కోసం కోకా కోలా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లను నియమించుకుంది. వీరిలో కోటక్, హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్, సిటీ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద శీతల పానీయాల కంపెనీ.. ఈ వేసవిలోనే భారత స్టాక్ ఎక్స్చేంజీల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇక ఐపీఓ కోసం కంపెనీ మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లుగా ఉంటుందని లెక్కగడుతున్నారు. ఇది భారత కరెన్సీలో రూ. 90 వేల కోట్లకుపైనే ఉంటుంది. దీంట్లో కనీసం 10 శాతం వాటా విక్రయిస్తే.. రూ. 9 వేల కోట్ల నిధుల్ని సమీకరించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే గతేడాది ఇలా మల్టీనేషనల్ కన్జూమర్ కంపెనీలు హ్యుందాయ్ మోటార్ ఇండియా, LG ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భారత స్టాక్ మార్కెట్లో ఐపీఓల ద్వారా లిస్టయిన సంగతి తెలిసిందే.