ఈఎసఐ తన అనుబంధ సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర ఈఎస్ఐ బృందం గత వారం ఇక్కడ పర్యటించి, ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు సాధ్యమో పరిశీలించింది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉమ్మడి కాలం నుంచే ఒక ఈఎస్ఐ మెడికల్ కాలేజీ ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఒక కాలేజీని ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది.రాష్ట్ర అధికారులు, మల్కాపురంలో ఉన్న 125 బెడ్ల ఈ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ప్రతిపాదించారు. ఈ హాస్పిటల్‌లో బెడ్ల సంఖ్యను 200కు పెంచాలని కోరుతూ 18 నెలల క్రితమే ప్రతిపాదనలు పంపించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో , రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలో మొత్తం నాలుగు ఈఎస్ఐ హాస్పిటల్స్ పనిచేస్తున్నాయి.వీటితో పాటు గుంటూరు, విజయనగరం, కాకినాడ, పెనుకొండ, శ్రీసిటీ, నెల్లూరు, అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో ఏడు కొత్త హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. విశాఖపట్నంలోని గాజువాకలో 400 బెడ్ల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అచ్యుతాపురం ప్రాజెక్ట్ కోసం భూమి కేటాయింపు ప్రక్రియ జరుగుతోంది.1952లో కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడానికి ప్రారంభమైన ఈఎస్ఐ వ్యవస్థ, 1972లో మల్కాపురంలో ఒక హాస్పిటల్‌ను ఏర్పాటు చేసింది. ఈ హాస్పిటల్ కోసం 10 ఎకరాల స్థలం కేటాయించారు. ఇందులో 4 ఎకరాలు హాస్పిటల్ కోసం, 6 ఎకరాలు స్టాఫ్ క్వార్టర్స్ కోసం కేటాయించారు. అయితే, ప్రస్తుతం ఈ స్టాఫ్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నాయి. ఈ హాస్పిటల్ ప్రస్తుతం దాదాపు 20 లక్షల మంది లబ్ధిదారులకు సేవలు అందిస్తోంది. వీరిలో 5.5 లక్షల మంది ఈఎస్ఐ కార్డు హోల్డర్ల కుటుంబాలు కూడా ఉన్నాయి.ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఫణీంద్ర మాట్లాడుతూ, కేంద్ర బృందం ప్రాజెక్ట్ సాధ్యతను అంచనా వేసి, అవసరమైన సమాచారాన్ని సేకరించిందని ధృవీకరించారు. మెడికల్ కాలేజీ నిర్మించడానికి, శిథిలావస్థలో ఉన్న స్టాఫ్ క్వార్టర్స్‌ను తొలగించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ కాలేజీలో 50 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అన్ని అనుమతులు సజావుగా జరిగితే త్వరలోనే ఈ కాలేజీ ప్రారంభం కావచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం హాస్పిటల్‌ను తాత్కాలికంగా అప్పగించాలని కేంద్ర ఈఎస్ఐ.. ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.