మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం, భారత్‌తో భాగస్వామ్యంపై కీలక నిర్ణయం

Wait 5 sec.

Trump Phone Call to PM Modi: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియ మిత్రుడు మోదీకీ 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఈ సందర్భంగానే ఇద్దరు నేతలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం, భారత్-అమెరికా బంధం గురించి ప్రధానంగా చర్చించారు. అంతేకాకుండా కీలక నిర్ణయం కూడా తీసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఇద్దరూ పోస్ట్ పెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. “నా స్నేహితుడు, మాట్లాడాను. ఆయనకు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాను. ఆయన అద్భుతమైన పని చేస్తున్నారు” అని ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి ట్రంప్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంపై మోదీ మద్దతు తన శాంతి ప్రయత్నాలకు ఎంతో ఉపకరిస్తుందని ట్రంప్ పరోక్షంగా సూచించారు.ట్రంప్ ఫోన్ కాల్‌కు స్పందిస్తూ ప్రధాని మోదీ కూడా మరో పోస్ట్ పెట్టారు. నా స్నేహితుడు, అధ్యక్షుడు ట్రంప్.. నా 75వ పుట్టిన రోజు సందర్భంగా చేసిన ఫోన్ కాల్‌కు, ఆయన ఆప్యాయ పలకరింపులకు ధన్యవాదాలు అని మోదీ అన్నారు. మీలాగే నేను కూడా భారత్-అమెరికా సమగ్ర, ప్రపంచ భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్ సంక్షోభం శాంతియుత పరిష్కారానికి సంబంధించి మీరు చేస్తున్న కృషికి చేశారు.భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకాలు..రష్యా-ఉక్రెయిన్ మధ్య చాలా కాలం నుంచి యుద్ధం సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీన్ని ఆపేందుకు అమెరికా రష్యా నుంచి ఎవరూ ఏమీ కొనుగోలు చేయొద్దని, ఏదీ అమ్మొద్దని పశ్చిమాసియా దేశాలకు సూచించారు. కానీ భారత్ మాత్రం తన వ్యక్తిగత అవసరాల దృష్ట్యా.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. దీంతో భారత్‌పై అక్కసు పెంచుకున్న ట్రంప్.. . కానీ భారత్ మాత్రం ఈ విషయంలో అస్సలే వెనక్కి తగ్గట్లేదు. ఏం చేసినా మేము మడమ తిప్పమని అనేక మార్లు ప్రధాని మోదీ బహిరంగంగానే చెప్పారు. కానీ తాజాగా వీరిద్దరూ చేసిన పోస్టులు చూస్తుంటే.. ఈ గొడవ త్వరలోనే ముగిసిపోబోతున్నట్లు అర్థం అవుతోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.