సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. 6 కొత్త రూల్స్ తెచ్చిన RBI.. కచ్చితంగా తెలుసుకోండి

Wait 5 sec.

Nomination: బ్యాంకులో ఖాతా ఉండడం అనేది సర్వసాధారణం. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. అలాగే ఏవైనా విలువైన వస్తువులు, పత్రాలు దాచుకునేందుకు చాలా మంది ఇప్పుడు బ్యాంకు లాకర్ తీసుకుంటున్నారు. అయితే, పొదుపు ఖాతా, బ్యాంక్ లాకర్ సంబంధించి 6 కొత్త రూల్స్ అమలులోకి వచ్చాయి. అకౌంట్, లాకర్ నామినేషన్ సంబంధించి ఈ కొత్త మార్పులు తీసుకొచ్చింది కేంద్రం. ఇప్పటి వరకు సేవింగ్స్ అకౌంట్‌కు ఒకరి పేరునే నామినీగా చేర్చే వీలుండగా దానిని నాలుగు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఖాతాలు, లాకర్లలో పేరుకుపోతున్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను తగ్గించేందుకు, వాటిని చట్టపరమైన వారసులకు అందించేందుకు కేంద్రం ఈ మేరకు నామినీల సంఖ్యను 4కు పెంచింది. ఖాతాదారు మరణించినప్పుడు అతడి కుటుంబ సభ్యులు సులభంగా ఖాతాలోని డబ్బులు, లాకర్ లోని వస్తువులు తీసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుందని తెలిపింది. ఖాతాదారు చట్టపరంగా ఒకరి పేరును ఎంపిక చేసుకునే విధానాన్నే నామినీ అంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనల ప్రకారం సేవింగ్స్ అకౌంట్ లేదా లాకర్‌లోని వాటిని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. . ఏకకాల నామినేషన్ విధానంలో ఒకేసారి నలుగురి పేర్లను నామినీగా ఎంచుకుని వారికి 40:30:20:10 విధంగా పర్సంటేజ్ ఎంచుకోవచ్చు. ఇక సక్సెసివ్ నామినేషన్ విధానంలో నామినీలను ప్రియారిటీ ప్రకారం ఎంచుకోవచ్చు. మొదటి నామినీ క్లెయిమ్ చేయకపోతే రెండో నామినీకి ఆటోమేటిక్‌గా అర్హత లభిస్తుంది. ఉదాహరణకు ఏకకాల నామినేషన్ ఎంచుకున్నప్పుడు రూ.10 లక్షలు ఉన్నాయనుకుంటే ముగ్గురు నామినీలు ఉంటే వారికి 40:30:30 ప్రకారం ఆ డబ్బులను పంచుతారు. అదే సక్సెసివ్ నామినేషన్ విధానంలో నామినీ ఏ అనే వ్యక్తి క్లెయిమ చేయకపోతే బీ అనే వ్యక్తికి మొత్తం డబ్బులు ఇస్తారు. బీ కూడా క్లెయిమ్ చేయకపోతే సీ అనే వ్యక్తికి వస్తాయి. ఇక విషయానికి వస్తే ఇక్కడ సైతం నలుగురు పేర్లను ఎంచుకోవచ్చు. ఇక్కడ సక్సెసివ్ నామినేషన్ మాత్రమే అనుమతి ఉంటుంది. సేవింగ్స్ అకౌంట్ మాదిరిగా రెండు విధానాలు ఉండవు. మొదటి నామినీ క్లెయిమ్ చేయకపోతేనే తదుపరి నామినీకి అర్హత లభిస్తుంది. ఇలా ఎవరు క్లెయిమ్ చేస్తే వారికే మొత్తం ఇచ్చేస్తారు. కొత్త నామినేషన్ రూల్స్ ద్వారా బ్యాంకుల్లోనే అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు తగ్గుతాయని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. 2024, మార్చి నాటికి మొత్తం ఎవరూ తీసుకోని డబ్బులు రూ.78,213 కోట్లుగా ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం 26 శాతం మేర పెరుగుతుండడం గమనార్హం. కొత్త రూల్స్ ద్వారా డిపాజిటర్ మరణించిన తర్వాత చాలా త్వరగా, సులభంగా డబ్బులు క్లెయిమ్ చేసుకునేందుకు వీలు కలుగుతుంది.