'T20 వరల్డ్ కప్ లాస్ట్ ఓవర్ గుర్తుందా? చెప్పు భాయ్.. పరేషాన్ ఎందుకు' నవాజ్‌ను ఓ ఆట ఆడుకున్న బుడ్డోడు.. వీడియో ఇదిగో!!

Wait 5 sec.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 మెల్‌బోర్న్ వేదికగా సూపర్ 12లో భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఎవ్వరూ మరచిపోలేరు. దాదాపు లక్ష మంది ప్రేక్షకులు భారత్, పాక్ నినాదాలతో స్టేడియాన్ని హోరెత్తించారు. ఆఖరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఆల్‌మోస్ట్ ఓడిపోయింది అనుకున్న మ్యాచ్‌ని లెజెండ్రీ బ్యాటర్ విరాట్ కోహ్లి ఒంటి చేత్తో గెలిపించాడు. టీమిండియా ఫ్యాన్స్ ఆ మ్యాచ్‌ని ఎప్పటికీ మరచిపోలేరు. అయితే, తాజాగా లో ఓ బుడ్డోడు ఆ మ్యాచ్‌ని గుర్తు చేశాడు. 2022లో ఆఖరి ఓవర్ వేసి పాక్ ఓటమకి కారణమైన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో మహమ్మద్ నవాజ్ బౌండరీ వద్ద ఫీల్డింగ్‌కి రాగా.. బుడ్డోడు నవాజ్‌ని టార్గెట్ చేశాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఆ మ్యాచ్ గుర్తుందా నవాజ్ భాయ్ అంటూ ఓ ఆట ఆడుకున్నాడు. "టీ20 వరల్డ్ కప్‌ 2022లో లాస్ట్ ఓవర్ గుర్తుందా నవాజ్ భాయ్. చెప్పు.. చెప్పు నవాజ్ భాయ్. అసలు గుర్తుందా లేదా.. ఎందుకు పరేషాన్ అవుతున్నావు చెప్పు నవాజ్ భాయ్. లాస్ట్ ఓవర్ భాయ్ నవాజ్ భాయ్ ఆన్సర్ చెప్పు భాయ్" అంటూ టీమిండియా జెర్సీ వేసుకున్న ఓ బుడ్డోడు కాసేపు నవాజ్‌ను ఏడిపించేశాడు. టీ20 వరల్డ్ కప్ 2022లో భారత్ విజయానికి 16 పరుగులు కావాల్సి ఉంది. క్రీజులో హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి ఉన్నారు. మొదటి బంతికే హార్దిక్‌ను పెవిలియన్‌కు పంపిన నవాజ్.. మిగతా రెండు బంతులకు మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక చివరి మూడు బంతుల్లో భారత్ విజయానికి 13 బంతులు కావాల్సి ఉంది. అయితే నో బాల్, ఆ తర్వాత ఎక్స్‌ట్రా పరుగులు రావడంతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 31 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం చేసి 53 బంతుల్లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్‌గా మ్యాచ్‌ని గెలిపించాడు. కోహ్లికి తోడు హార్దిక్ పాండ్యా కూడా 40 పరుగులతో రాణించాడు. ఆఖరి బంతికి రవిచంద్రన్ అశ్విన్ విన్నింగ్ షాట్ అందించాడు.