గ్రాముపై రూ. 7 వేలకుపైగా లాభం.. లక్ అంటే ఇదీ.. బంగారంతో కళ్లుచెదిరే రిటర్న్స్

Wait 5 sec.

: భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ) ప్రకటించింది. 2019, సెప్టెంబర్ 17న దీనిని ఇష్యూ చేయగా.. ఇప్పుడు రిడీమ్ చేసుకునేందుకు అవకాశం ఉందని ప్రకటించింది. సాధారణంగా గోల్డ్ బాండ్లపై ఫిక్స్‌డ్ టెన్యూర్ 8 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ అవసరమైతే ముందుగానే ఐదేళ్లు దాటిన తర్వాత బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బాండ్స్ ఇష్యూ చేసిన ఐదేళ్లు దాటిన తేదీ నుంచి.. ముందస్తు ఉపసంహరణ చేసుకోవచ్చు.ఈ క్రమంలోనే ఐదేళ్లు దాటిన నేపథ్యంలో 2019-20 సిరీస్-4 గోల్డ్ బాండ్ ధరల్ని ప్రకటించింది. ఈ బాండ్స్ కోసం సబ్‌స్క్రిప్షన్ 2019, సెప్టెంబర్ 9- 13 మధ్య జరిగింది. దీనిని సెప్టెంబర్ 17న ఇష్యూ చేశారు. ఇప్పుడు 2025, సెప్టెంబర్ 17ను ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ డేట్‌గా ప్రకటించింది. అంటే.. ఇప్పటి నుంచి డబ్బులు తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుందన్నమాట. . ఈ క్రమంలోనే బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వారికి కళ్లుచెదిరే రిటర్న్స్ వస్తున్నాయి. ఈ సిరీస్ లాంఛింగ్ సమయంలో ఇందులో చేరిన వారికి మంచి లాభాలు వచ్చాయి. అప్పుడు ఇష్యూ ధర గ్రాముకు/యూనిట్‌కు రూ. 3,890 గా ఉండేది. ఇక ఆన్‌లైన్‌లో అప్లై చేసి.. డిజిటల్ మోడ్‌లో పేమెంట్ చేసిన వారికి గ్రాముపై రూ. 50 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు గ్రాముకు రూ. 3840 గానే అయింది. ఇక ఇప్పుడు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ రూ. 11,003 గా పేర్కొంది. సెప్టెంబర్ 12, 15, 16 తేదీల్లోని ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) సగటు బంగారం ధర ఆధారంగా.. ఆర్బీఐ ఈ రేట్లను ప్రకటించింది. ఇక్కడ రిటర్న్స్ చూస్తే.. రూ. 11,003- రూ. 3840= రూ. 7,163 లాభం గ్రాముపైనే వచ్చింది. ఇంకా ఇక్కడ వార్షిక ప్రాతిపదికన 2.50 శాతం వడ్డీ రేటు అదనంగా వస్తుంది. దీనిని శాతం లెక్కల్లో చూస్తే.. (7163/3840)X100= 186 శాతం రాబడి వచ్చింది. ఉదాహరణకు ఇష్యూ ధర రూ. 3840 దగ్గర రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి 26 గ్రాముల వరకు బంగారం వచ్చింది. ఇదే ఇప్పుడు రిడెంప్షన్ ధర రూ. 11,003 తో చూస్తే.. రూ. 2,86,536 అయింది. ఇక్కడ లక్షపై వడ్డీ లేకుండానే మరో రూ. 1.86 లక్షల లాభం వచ్చింది. ఆ వడ్డీతో కలుపుకుంటే దాదాపు రూ. 2 లక్షల వరకు లాభం వచ్చి ఉంటుంది.