ధర 20 రూపాయలే.. 2 షేర్లు కొంటే 1 షేరు ఉచితం.. సెప్టెంబర్ 29 వరకే ఛాన్స్

Wait 5 sec.

: స్మాల్ క్యాప్ కేటగిరి ట్రేడింగ్ సెక్టార్ కంపెనీ చంద్ర ప్రభు ఇంటర్నేషనల్ లిమిటెడ్ () బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ షేర్ హోల్డర్లకు ఉచితంగా షేర్లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ఇటీవలే కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశమై జారీ చేయడానికి ఆమోదం తెలిపారు. ఈ బోనస్ ఇష్యూ ప్రకారం ప్రతి 2 షేర్లకు అదనంగా 1 ఈక్విటీ షేరు ఉచితంగా లభిస్తుంది. రికార్డు డేట్ సెప్టెంబర్ 29గా నిర్ణయించినట్లు తెలిపింది. దీంతో ఈ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. అంతే కాదు ఈ కంపెనీ స్టాక్ గత ఐదేళ్లలో 645 శాతం లాభాన్ని అందించింది. కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. చంద్ర ప్రభు ఇంటర్నేషనల్ కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ కొద్ది రోజుల క్రితమే 1:2 రేషియోలో బోనస్ షేర్లు అందించేందుకు ఆమోదం తెలిపారు. దీని అర్థం రికార్డు తేదీ నాటికి రూ. 2 ఫేస్ వ్యాల్యూ ఉన్న 2 ఈక్విటీ షేర్లను తమ డీమ్యాట్ ఖాతాలో కలిగి ఉన్నవారికి ఈ బోనస్ షేర్లు జారీకి అర్హులైన వారిని గుర్తించే రికార్డు తేదీని సెప్టెంబర్ 29గా బోర్డు నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.శుక్రవారంతో ముగిసిన ట్రేడింగ్ సెషన్లో చంద్ర ప్రభు ఇంటర్నేషనల్ స్టాక్ 2.43 శాతం లాభంతో రూ. 20.20 వద్ద ముగిసింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 195.80, కనిష్ఠ ధర రూ. 110.50 వద్ద ఉన్నాయి. గత వారం రోజుల్లో ఈ స్టాక్ 1 శాతం నష్టాన్ని మిగల్చగా, గత నెల రోజుల్లో 19 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఆరు నెలల్లో 34 శాతం లాభాలు అందించింది. గత ఏడాదిలో 3 శాతం నష్టపోయింది. గత ఐదేళ్లలో 623 శాతం లాభాలు ఇచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 461 కోట్ల వద్ద ఉంది.ఈ కథనం ఇన్వెస్టర్లకు సమాచారం అందించేందుకే తప్పితే ఎలాంటి పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించడం లేదు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై హైరిస్క్ ఉంటుంది. సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.