హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓజీ'. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవర్ స్టార్ అభిమానులందరూ ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఆతృతగా వేచి చూస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న OG ట్రైలర్ కూడా వచ్చేసింది. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో ట్రైలర్ ను లాంచ్ చేశారు. వర్క్ కంప్లీట్ అవ్వకపోయినా పర్వాలేదు అంటూ ఫ్యాన్స్ కోసం ట్రైలర్ ప్రదర్శించారు. OG ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో అదరగొట్టాడు. ఇంతకముందెన్నడూ చూడని విధంగా తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నారు. ఫ్యాన్ బాయ్ సుజిత్ అభిమానులు తమ హీరోని ఏ విధంగా చూడాలని అనుకుంటారో.. ఆ విధంగా ప్రజంట్ చేశారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి విలన్ గా కనిపించారు. లో విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఈ మూవీని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నారు.