నేను డిప్యూటీ సీఎం అనే సంగతి మర్చిపోయాను: పవన్ కళ్యాణ్

Wait 5 sec.

హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో సెప్టెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో ఆదివారం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి పవన్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, థమన్ తో సహా టీమంతా హాజరయ్యారు. అల్లు అరవింద్, దిల్ రాజు, కోన వెంకట్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఓజీ సినిమాలో పోషించిన ఓజాస్ గంభీర గెటప్ లో పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు వచ్చారు. సినిమాలో ఉపయోగించిన పెద్ద కత్తి పట్టుకొని స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చారు. 'వాషి యో వాషి' అనే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను డిప్యూటీ సీఎం అనే సంగతి మర్చిపోయానని, అందుకే ఇలా కత్తి పట్టుకొచ్చానని అన్నారు. సుజిత్ వల్ల ఫస్ట్ టైమ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సినిమా గెటప్ లో రావాల్సి వచ్చిందన్నారు. ఓ యంగ్ డైరక్టర్ ఉన్నారని, సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ శ్రీనివాస్ సుజిత్ ను పరిచయం చేసారని చెప్పారు. ఓజీ సినిమాకి నేను స్టార్ కాదని.. సుజిత్, థమన్ ఇద్దరు స్టార్లు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.