బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి అప్పగించాలన్నడిమాండ్‌ను తోసిపుచ్చారు. ఒక్క అంగుళం కూడా ఇవ్వబోమని, దానిపై ఒప్పందం ప్రసక్తేలేదని తాలిబన్ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆఫ్ఘన్ ప్రభుత్వ రక్షణ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని కాబూల్‌కు ఉత్తరాన ఉన్న బాగ్రామ్ ఆఫ్ఘనిస్థాన్‌లో అతిపెద్ద వైమానిక స్థావరం. రెండు దశాబ్దాలు తాలిబన్లతో యుద్ధంలో అమెరికా సైనిక కార్యకలాపాలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉంది. నాలుగేళ్ల కిందట అమెరికా సేనలు అఫ్గన్ నుంచి వైదొలగాయి. మళ్లీ ఈ స్థావరాన్ని తిరిగి ఇవ్వకపోతే అఫ్గన్ తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోక తప్పదని ట్రంప్ హెచ్చరించారు. ‘ఆఫ్గనిస్థాన్‌లోని బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అమెరికా నిర్మించింది.. దానిని తిరిగి మాకు అప్పగించకపోతే చెడు జరగబోతోంది!!’" ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఈ బెదిరింపులపై ఆఫ్ స్టాఫ్ ఫాసిహుద్దీన్ ఫిత్రాత్ స్పందించారు. కొంత మంది రాజకీయ ఒప్పంద ద్వారా బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని భావిస్తున్నారని పరోక్షంగా ట్రంప్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ‘బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోడానికి ఇటీవల కొంత మంది అఫ్గని‌తో చర్చలకు ప్రయత్నించారు.. మా భూభాగంలోని ఒక్క అంగుళంపై కూడా ఒప్పందం సాధ్యం కాదు. మనకు ఎలాంటి ఒప్పందం అవసరం లేదు’ అని తెగేసి చెప్పారు.ఈ వ్యాఖ్యల అనంతరం అఫ్గన్‌లోని తాలిబన్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘అఫ్గన్ ప్రాంతీయ సమగ్రత, స్వతంత్రతకు మాకు ఎంతో ముఖ్యం’ అని స్పష్టం చేసింది. చైనాకు సమీపంగా ఉన్న ఈ స్థావరాన్ని వదిలివేయడంపై ట్రంప్ పదే పదే విమర్శిస్తున్నారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న ట్రంప్.. అమెరికా దానిని తిరిగి తన ఆధీనంలోకి తీసుకోవాలనే ఆలోచనను బహిరంగంగా లేవనెత్తారు. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా దళాలు అఫ్గన్ నుంచి వెనక్కి వచ్చాయి. కానీఇందులో భాగంగా జులై 2021లో అమెరికా, నాటో దళాలు బాగ్రామ్ నుంచి వైదొలిగాయి. ఈ స్థావరం నుంచి వైదొలగిన కొద్ది వారాల్లోనే అఫ్గన్ సైన్యం కుప్పకూలిపోగా.. తాలిబన్లు పట్టు సాధించారు. గతంలో బీ-52లు, బ్లాక్ హాక్స్‌లు ఉన్న ఈ స్థావరం చైనా నుంచి ఎదురయ్యే ముప్పు పర్యవేక్షణ సహా అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు కేంద్ర స్థానంగా నిలిచింది. ఇక, తాలిబన్లు కూడా చైనాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.