MCLR: దసరా ఉత్సవాలు మొదలయ్యాయి. దుర్గా శరన్నవరాత్రుల వేళ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లను తగ్గించింది. దీంతో సామాన్యులకు భారం తగ్గనుంది. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో 5 ప్రధాన బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించి దసరా కానుక అందించాయి. దీంతో లోన్ ఈఎంఐలు సైతం తగ్గుతాయి. అంటే దసరాకు మధ్య తరగతి ప్రజలపై భారం భారీగా దిగిరానుంది. కేంద్రంతో పాటు బ్యాంకులు సైతం ఊరట కల్పించడం గమనార్హం. మరి ఆ బ్యాంకులు ఏవి, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు తగ్గింది అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లెండింగ్ రేట్లుమూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.60 శాతంగా ఉంది. కానీ, ఆరు నెలలు, ఏడాది ఎంసీఎల్ఆర్ రేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలాగే రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.75 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గింది. ఇక మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 8.75 శాతం వద్ద ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా లెండింగ్ రేట్లుఈ ప్రభుత్వ బ్యాంకులో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు కొత్త రేట్లు సెప్టెంబర్ 12, 2025 నుంచే అమలులోకి వచ్చాయి. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 10 బేసిస్ పాయింట్లు తగ్గి 7.85 శాతానికి తగ్గింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు తగ్గి 8.20 శాతానికి దిగివచ్చింది. వన్ మంత్ 7.95 శాతం, ఆరు నెలలు 8.65 శాతం, ఏడాది ఎంసీఎల్ఆర్ 8.80 శాతం వద్ద ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లెండింగ్ రేట్స్ ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు తగ్గి 8 శాతానికి దిగివచ్చింది. ఇక ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు తగ్గించారు. పీఎన్‌బీ లెండింగ్ రేట్స్పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఎంసీఎల్ఆర్ రేటు ఓవర్ నైట్ టెన్యూర్ పై 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇక నెల రోజుల పై 5 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.25 శాతాని చేర్చింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.45 శాతానికి దిగివచ్చింది. ఆరు నెలలకు 8.65 శాతానికి తగ్గించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.80 శాతానికి తగ్గింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 9.15 శాతం నుంచి 9.10 శాతానికి తగ్గించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా లెండింగ్ రేట్లుబ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల వడ్డీ రేట్లను 5 నుంచి 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఓవర్ నైట్ టెన్యూర్ మినహా అన్నింటిపై ఈ వడ్డీ రేట్లు తగ్గాయి. ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.95 శాతం వద్ద ఉంది. ఇక నెల రోజుల ఎంసీఎల్ఆర్ 8.40 శాతం నుంచి 8.30 శాతానికి తగ్గింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.55 శాతం నుంచి 8.45 శాతానికి తగ్గించారు. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.80 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గించారు. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 8.90 శాతం నుంచి 8.85 శాతానికి తగ్గించారు. ఇక మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటును 9.15 శాతం నుంచి 9 శాతానికి తగ్గించారు.