ఓజీ సెన్సార్ రిపోర్ట్.. ఆ సీన్స్ కట్.. రన్‌టైమ్‌ ఎంతంటే?

Wait 5 sec.

'హరి హర వీరమల్లు' వంటి భారీ డిజాస్టర్ తర్వాత నుంచి రాబోతున్న సినిమా They Call Him OG. సింపుల్ గా 'ఓజీ' అని పిలుచుకుంటున్నారు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకి భారీ హైప్ తీసుకొచ్చి పెట్టింది. మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ సెన్సార్‌ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. OG మూవీకి సోమవారం (సెప్టెంబర్ 22) సెన్సార్ కార్యక్రమాలు నిర్వహించారు. సినిమా చూసిన బోర్డ్ సభ్యులు.. కొన్ని కటింగ్స్ తో ఈ చిత్రానికి 'ఎ' (A) సర్టిఫికెట్‌ జారీ చేశారు. అంటే ఈ సినిమా పెద్దలు మాత్రమే. వైలెంట్ కంటెంట్ బాగా ఎక్కువ ఉండటంతో ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు కొన్ని సన్నివేశాలకు మార్పులు సూచించింది. డ్రగ్స్, స్మోకింగ్‌ సీన్‌కు సంబంధించి డిస్‌క్లయిమర్‌ వేయాలని.. వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని బోర్డు ఆదేశించింది. చెయ్యి నరికే సన్నివేశాన్ని ట్రిమ్ చేయాలని, లాడ్జి సీన్ లో వైలెన్స్ సీన్స్ కట్ చేయాలని సూచించింది. వీటితో పాటుగా హింస, రక్తపాతం ఎక్కువగా సన్నివేశాల క్లోజప్స్ ట్రిమ్‌ చేయమని చెప్పింది. సెన్సార్ బోర్డ్ సూచనల మేరకు 'ఓజీ' మేకర్స్ సినిమాలో మార్పులు చేశారు. దాదాపు 2 నిమిషాల ఫుటేజీ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఒరిజినల్‌ రన్‌టైమ్‌ 156.10 నిమిషాలు ఉంటే.. సెన్సార్ తర్వాత 154.15 నిమిషాల నిడివి వచ్చింది. ఫైనల్ గా 2 గంటల 54 నిమిషాల (దాదాపు 3 గంటలు) లెన్త్ తో పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలోకి రానుంది. నిడివిని బట్టి ఇది చాలా పెద్ద సినిమానే అనుకోవాలి. ఇటీవల కాలంలో సినిమా బాగుంటే మూడు గంటలకు పైగా ఉన్నా సరే.. జనాలు థియేటర్లలో కూర్చొని ఓపికగా చూస్తున్నారు. మరి OG కూడా అంతసేపు సీట్లో కూర్చోబెడుతుందేమో చూడాలి.