కోల్‌కతాలో క్లౌడ్‌బరస్ట్ బీభత్సం.. 22 రోజుల్లో కురవాల్సిన వాన ఆరు గంటల్లోనే!

Wait 5 sec.

పశ్చిమ్ బెంగాల్ రాజధాని కోల్‌కతా నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం ఉదయం నుంచి మెల్లగా మొదలైన వర్షం.. అంతకంతకూ పెరుగుతూ కుంభవృష్టి కురిసింది. వల్ల కురిని భారీ వర్షాలకు ఉత్తర కోల్‌కతాలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలో చిక్కుకోగా.. రహదారులు పూర్తిగా నీటముని చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలు స్తంభించి, రైలు, మెట్రో సేవలు నిలిచిపోయాయి. విమానాశ్రయం నీటమునిగి.. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షాలకు మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ముగ్గురు విద్యుత్‌ షాక్‌‌తోనూ.. వరదల్లో కొట్టుకుపోయి మరో ఆరుగురు మరణించారు. కొద్ది గంటల్లో సెప్టెంబరు నెలలోని 22 రోజుల్లో కురిసిన వర్షం కంటే అధిక వర్షపాతం నమోదయ్యింది. కోల్‌కతాలో ఈ నెల 1 నుంచి 22 వరకు 178 మి.మీ. వర్షపాతం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం 213.7 మి.మీ. కంటే 16 శాతం లోటు. కానీ, సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల మధ్య 24 గంటల్లోనే 247.4 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. ఇందులో అధిక భాగం రాత్రి కొద్ది గంటల్లోనే నమోదుకావడం గమనార్హం. కోల్‌కతా నగరంలో నమోదైన వర్షపాత గణాంకాలను భారత వాతావరణ విభాగం విడుదల చేసింది. ఐఎండీ గణాంకాలు దుర్గాపూజలకు ముందు నగరంలో వర్ష బీభత్సం ఏస్థాయిలో ఉందో వెల్లడించాయి.ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని కోల్‌కతా మేయర్ ఫర్హాద్ హకీమ్ విజ్ఞ‌ప్తి చేశారు. నగరంలో సాధారణ పరిస్థితి రావడానికి కనీసం 12 గంటలు పడుతుందని, మళ్లీ వర్షం కురిసే అవకాశం లేదని మేయర్ తెలిపారు. కారణంగా కోల్‌కతా, హుగ్లీ, హౌరా సహా బెంగాల్‌ తీరప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్టు ఐఎండీ తెలిపింది. మరో 24 గంటల పాటు ఈ వాయుగుండం అదే ప్రాంతంలో కొనసాగే అవకాశం ఉందని, దీని ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.కోల్‌కతా, పరిసర ప్రాంతాల్లో సోమవారం రాత్రి 12 గంటల నుంచి మొదలై 6 గంటల వరకు అత్యంత భారీ వర్షం కురిసింది. దీంతో జనం నిద్ర నుంచి మేల్కొనేసరికి నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది. అత్యధికంగా బల్లిగంజ్‌లో 295 మి.మీ వర్షపాతం నమోదుకాగా.. తర్వాత ముకుందపూర్ (280 మి.మీ.), గరీయాహాట్ (262 మి..మీ), జాదవ్‌పూర్ (258 మి.మీ), అలీపోర్ (240) లో నమోదయ్యింది. కోల్‌కతాలో 24 గంటల వ్యవధిలోనే 2,633 శాతం అధిక వర్షపాతం నమోదయినట్టు ఐఎండీ వెల్లడించింది. తర్వాత హౌరా 1006 శాతం, ఉత్తర 24 పరగణాలు 857 శాతం అధిక వర్షం కురిసింది.