ఇల్లు ఇల్లాలు పిల్లలు: నీకోసం నేనున్నా ప్రేమా.. నీ మనసులో నేను లేను ధీరజ్.. కలవని ‘ప్రేమ’ పక్షులు

Wait 5 sec.

ప్రేమను కళ్యాణ్ నుంచి రక్షించిన ధీరజ్.. ఆమె మాన ప్రాణాలను కాపాడతాడు. అయితే కళ్యాణ్.. తృటిలో తప్పించుకుని పారిపోతాడు. ఇక ప్రేమ.. ‘కన్నీరంతా కడలై పొంగీ.. కల్లోలంలా మార్చేసిందీ’ అంటూ సాంగ్ వేసుకుని బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ కూడా అక్కడే ఉండటంతో.. ‘సుడిగుండంలో పడవై.. బ్రతుకే మారే.. బయటే పడదామన్నా లేదే దారీ’ అంటూ ఆ సాంగ్‌ని కంటిన్యూ చేస్తూ బాధపడుతుంటాడు. ఇక సాంగ్ కంప్లీట్ అయిన తరువాత.. ధీరజ్ వచ్చి ప్రేమ పక్కనే కూర్చొంటాడు. ‘ఇన్నిరోజులూ నీలో నువ్వు ఎంత బాధపడ్డావ్ ప్రేమా.. ఎంత నరకం అనుభవించావ్.. ఏ ఒక్కమాట నాతో చెప్పుకోవాలనిపించలేదా? నీ బాధని పంచుకలోని పరాయి వాడ్ని అయిపోయానా? నేనూ.. నువ్వు ఎందుకు బాధపడుతున్నావో అని ఎంతమందిని అడిగానో తెలుసా.. నీ బాధకి అర్థం ఏంటో తెలియక నీతో పాటు నేను కూడా నరకం చూశాను. కానీ నువ్వు ఎంతకీ చెప్పకపోవడంతో.. నీ చావు నువ్వు చావు అని నీతో గొడవపడ్డాను. నువ్వు వెళ్లిపోగానే నిన్ను ఫాలో అయ్యాను. అసలు నువ్వు ఏ ధైర్యంతో వాడ్ని ఎదుర్కోవడానికి వచ్చావ్? ధైర్యంగా ఉండటం మంచిదే కానీ.. ఇలాంటి విషయాల్లో రిస్క్ చేస్తారా? ఒకవేళ నేను రాకపోయి ఉంటే ఏమయ్యేది. నాతో సహా కొన్ని ప్రాణాలు.. నీకోసం బతుకుతున్నాయ్.. ఆ ప్రాణాలు తట్టుకోగలవా? నిన్ను నా మనిషి అని అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం.. నన్ను పరాయి వాడ్ని చేశావ్. తిండి నిద్ర లేకుండా ఇన్నిరోజులు బాధపడ్డావ్.. నన్నూ బాధపడ్డావ్. ఒక్కసారైనా నాకోసం ధీరజ్ ఉన్నాడూ... వాడికి చెప్పాలని నీకెందుకు అనిపించలేదు ప్రేమా? అని ఎమోషనల్ అవుతాడు ధీరజ్. దాంతో ప్రేమ.. ‘ఎలారా.. నీకు ఎలా చెప్పుకోవాలీ.. నా సమస్య నీతో చెప్పుకోవడానికి వచ్చిన ప్రతిసారీ.. నన్ను దూరం పెట్టావ్. ఆ కళ్యాణ్ గాడితో వెళ్లిపోయి ఉంటే బాగుండూ... నన్ను కాపాడటానికి మాత్రమే తాళి కట్టానని అన్నావ్.. అది కట్టకుండా ఉంటే బాగుండేదని అన్నావ్. నీ మనసులో అలాంటి భావన ఉన్నప్పుడు.. నాకు ధీరజ్ ఉన్నాడనే భావన ఎలా కలుగుతుంది? నాకు కష్టం వస్తే నాకు గుర్తొచ్చే ధైర్యం నువ్వేరా.. కానీ నువ్వు నన్నే కష్టంగా ఫీల్ అవుతున్నప్పుడు నా కష్టాన్ని నీతో ఎలా పంచుకోగలను. నన్ను ఒక వస్తువుగా మాత్రమే చూస్తున్నావ్. వస్తువు బాధని నువ్వు అర్థం చేసుకుంటావ్ అని ఏ ఆశతో నీతో చెప్పాలి. అందుకే చావైనా బతుకైనా నేనే తేల్చుకోవాలని అనుకున్నా.. ఎందుకంటే నాకు ఎవరూ లేరు.. నేను ఒంటరిని’ అంటూ భోరున ఏడుస్తుంది ప్రేమ. దాంతో ధీరజ్.. ప్రేమ చేయి పట్టుకుని.. నువ్వు ఒంటరివి కాదు.. నీకోసం నేను ఉన్నాను.. అని అంటాడు. ఆ మాటతో ప్రేమ.. ‘నీకోసం నేను ఉన్నాను అని అంటున్నావ్.. కానీ నీ మనసులో నేను లేనురా’ అని అంటుంది. దాంతో ప్రేమ చేయి వదిలేసిన ధీరజ్.. ‘మనసు నిప్పులా మారిపోతే ఈ మంటదేమి తప్పూ’.. అని సాంగ్ వేసుకుంటాడు. దాంతో ప్రేమా అక్కడ నుంచి ఏడుస్తూ ఇంటికి వెళ్లిపోతుంది. సీన్ అయితే ఇద్దరూ చింపేశారు కానీ.. చేయి పట్టుకున్నవాడు ఎందుకు వదిలేశాడో మాత్రం తెల్వదుగా. ఇక ఈ ఉప్పు నిప్పుల బాధ ఇలా ఉంటే.. అటు నర్మద, సాగర్‌లది వేరే బాధ. నర్మద తన అందాలతో సాగర్‌ని ఊరిస్తూ ఉంటుంది. మనోడు ఊరిపోతూ తెగ మెలికలు తిరుగుతుంటాడు. తల స్నానం చేసొచ్చి కరులను ఆరబెట్టుకుంటూ ఉంటుంది నర్మద. ఇంతలో మల్లెపూలు పట్టుకుని వాలిపోతాడు. మైడియర్ డార్లింగ్.. జాబ్‌లో ప్రమోషన్ వచ్చింది కాబట్టి.. ఈ శ్రీవారు అత్యంత ప్రేమతో అందిస్తున్నకానుక ఈ మల్లెపూలు అందుకో అని అంటాడు. దాంతో నర్మద.. ‘అయ్యో.. గిఫ్ట్‌గా ఏ చీరనో.. గ్రీటింగ్ కార్డ్‌నో ఇస్తాడు.. మల్లెపూలు గిఫ్ట్ ఏంట్రా సామీ’ అని అంటుంది. భర్త మనసులోని ప్రేమని భార్యతో చెప్పడానికి మల్లెపూలకంటే సాధనం.. ఇంకోటి లేదు తెలుసా? అని సాంగ్ వేసుకుంటున్నాను. ఆ రొమాంటిక్ సాంగ్‌ని రేపటి ఎపిసోడ్‌లో వీక్షించెదము.