Belated ITR: గత ఆర్థిక సంవత్సరం 2024-25కి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ముగిసిపోయింది. ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్ పోర్టల్‌లో టెక్నికల్ ఇష్యూల వల్ల ఐటీఆర్ ఫైల్ చేయలేకపోతున్నామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు భారీగా ఫిర్యాదులు అందిన క్రమంలో ఒకరోజు గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ గడువు సైతం సెప్టెంబర్ 16వ తేదీ అర్ధరాత్రితో ముగిసిపోయింది. మంగళవారం సాయంత్రం వరకు 7 కోట్లకు పైగా రిటర్నులు ఫైల్ అయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గడువు ముగిసిన తర్వాత ఐటీ రిటర్నులు ఫైల్ చేస్తే దానిని బిలేటెడ్ రిటర్న్స్ (Belated Returns) అంటారు. చట్టం 1961లోని సెక్షన్ 139 (4) ప్రకారం డిసెంబర్ 31వ తేదీ వరకు ఫైల్ చేయవచ్చు. అయితే, ఆలస్యంగా ఫైల్ చేసే వారికి సెక్షన్ 234ఎఫ్ కింద పెనాల్టీలు విధిస్తారు. ఈ జరిమానా ఆదాయం పరిమితిని బట్టి మారుతుంటుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నట్లయితే రూ.1000 జరిమానా కట్టాలి. రూ.5 లక్షలకు మించి ఉన్నవారు రూ.5000 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఒకవేళ ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోతే ఎలాంటి ఫైన్ ఉండదు. బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ ప్రాసెస్ ఇదేముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్‌సైట్లోకి లాగిన్ కావాలిమొదటగా ఇ-ఫైల్ ఎంచుకుని తర్వాత ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సెలెక్ట్ చేయాలి. ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ ట్యాబ్ పై క్లిక్ చేయాలి. సంబంధిత అసెస్మెంట్ ఇయర్, ఆన్‌లైన్ మోడ్ ఎంచుకోవాలి. అప్లికేషన్ స్టేటస్ వ్యక్తిగత లేదా హెచ్‌యూఎఫ్ వంటివి ఎంపిక చేయాలి. రిటర్నులు దాఖలు చేసే వ్యక్తికి వర్తించే ఐటీఆర్ ఫారం ఎంచుకోవాలి. మీరు తెలిపిన వివరాలు ధ్రువీకరించేందుకు పర్సనల్ ఇన్ఫర్మే,న్ సెక్షన్ లోకి వెళ్లాలి.సెక్షన్ 139 (4) ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ ఆదాయపు పన్ను వివరాలు ఎంటర్ చేయాలి. ఆలస్య రుములు చెల్లించి రిటర్నులు దాఖలు చేయాలి.గడువు ముగిసినప్పిటికీ ఆలస్య రుములు, పెనాల్టీలు చెల్లించి ఐటీ రిటర్నులు ఫైల్ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా క్రెడిట్ స్కోరుపై ప్రతికూల ప్రభావం పడకుండా, కొత్త లోన్స్, క్రెడిట్ కార్డులు తీసుకోవడంలో ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చని అంటున్నారు. వివిధ కారణాలతో ఇచ్చిన గడువులోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయని వారు వీలైనంత త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయడం మంచిదని చెబుతున్నారు.