Gold Rate Today: భారత్‌లో దసరా, దీపావళి పండగల సీజన్ మొదలైంది. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు అధికంగా జరుగుతుంటాయి. అయితే, ఇదే సమయంలో ఆకాశాన్ని తాకుతూ బెంబేలెత్తిస్తున్నాయి. రోజు రోజుకు భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు షాకులిస్తున్నాయి. మన దేశంలో ఎక్కువగా ఈ దసరా, దీపావళి సమయంలో బంగారం కొంటుంటారు. ఈ రెండు పండగలకు బంగారం కొంటే మంచిదని భారతీయులు నమ్ముతారు. అయితే, ఇక పలు దేశాల మధ్య ఉద్రిక్తతలు పసిడి రేట్లు పెరిగేందుకు సాయపడుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర ఎన్నడూ లేనంతగా 3700 డాలర్లు దాటి ట్రేడవుతోంది. దీంతో దేశీయంగానూ ఆ ప్రభావం కనిపించింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు బంగారం రేట్లు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డ్ స్థాయికి దూసుకెళ్లాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) ఏకంగా 70 డాలర్లు పెరిగి 3752 డాలర్ల వద్దకు చేరుకుంది. ఇది ఆల్‌ టైం హై స్థాయిగా చెప్పవచ్చు. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.18 శాతం పెరిగి 44.03 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన బంగారం ధరహైదరాబాద్ విపణిలో 24 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ఇవాళ రూ. 920 మేర పెరిగింది. దీంతో తులం రేటు రూ.1,13,070 వద్దకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ.850 మేర పెరిగింది. దీంతో తులానికి రూ. 1,03,650 వద్దకు ఎగబాకింది. ఒక్కరోజే రూ.3000 పెరిగిన వెండిబంగారంతో పోటీ పడుతూ వెండి సైతం ఆకాశామే హద్దుగా చెలరేగుతోంది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా రూ.3000 పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,48,000 స్థాయికి చేరుకుంది. ఇక ఢిల్లీ, ముంబై, పుణె, కోల్‌కతా వంటి నగరాల్లో కిలో సిల్వర్ రేటు రూ.1,38,000 స్థాయిలో లభిస్తుండడం గమనార్హం. ఈ కథనంలో చెప్పిన బంగారం, సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో ధరలు మధ్యాహ్నానికి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక రేట్లు తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ప్రాంతాలను బట్టి ధరలు వేరుగా ఉంటాయి.