హోండా బంపరాఫర్.. ఈ మోడల్‌పై ఏకంగా రూ. 1.20 లక్షలు తగ్గింపు

Wait 5 sec.

: జీఎస్టీ రేట్లు తగ్గిన క్రమంలో.. తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ కార్ మేకర్ కూడా గుడ్‌న్యూస్ చెప్పింది. అమేజ్ సబ్ కాంపాక్ట్ సెడాన్ ధరల్ని భారీగా తగ్గించడం విశేషం. ప్రస్తుతం మారుతీ సుజుకీ డిజైర్, హ్యుందాయ్ అరాతో పోటీపడుతున్న.. హోండా అమేజ్ ధర ఏకంగా రూ. 1.20 లక్షల వరకు తగ్గి.. మరింత చవకగా మారిందని చెప్పొచ్చు. ఈ మేరకు కొత్త ధరల్ని ప్రకటించింది. ఇది సెప్టెంబర్ 22 నుంచే అమల్లోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది. దిగ్గజ కార్ మేకర్స్ ఏం చేస్తున్నాయంటే.. అన్ని మోడళ్లపై ఒకేసారి ధరల్ని తగ్గించట్లేదు. వేర్వేరు మోడళ్లపై వేర్వేరు ప్రకటనల్ని చేస్తున్నాయి. ఇదే సమయంలో జీఎస్టీ రేట్ల కోతతో పాటు.. పండగ సీజన్ కాబట్టి ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నాయి. దీంతో మరింత చౌక ధరలకే కొత్త కార్లు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు మారుతీ సుజుకీ డిజైర్ ఎక్స్‌షోరూం ధరలు రూ. 6.84-రూ. 10.19 లక్షల మధ్య ఉంది. హ్యుందాయ్ అరా ధర రూ. 6.54 లక్షల నుంచి రూ. 9.11 లక్షల మధ్య ఉంది. హోండా అమేజ్ విషయానికి వస్తే రూ. 8.10- 11.2 లక్షల మధ్య ఉంది. ఈ ధరలు వేరియంట్‌ను బట్టి మారుతుంటాయి... S MT వేరియంట్ ధర రూ. 65,100 తగ్గగా ఎక్స్ షోరూం ధర రూ. 6,97,700 కు చేరింది. S CVT రూ. 72,800 తగ్గి.. రూ. 7,79,800 కు దిగొచ్చింది.థర్డ్ జెనరేషన్ విషయానికి వస్తే.. ఇక్కడ ZX CVT వేరియంట్‌పై గరిష్టంగా రూ. 1.20 లక్షలు తగ్గింది. దీని ఎక్స్‌షోరూం ధర ఇప్పుడు రూ. 9,99,900 కు దిగొచ్చింది. ZX MT ధర రూ. 85,300 తగ్గింది. VX CVT మోడల్ ధర రూ. 85,300 తగ్గి ఇప్పుడు రూ. 9,14,600 కు చేరింది. ఇదే సమయంలో VX MT వేరియంట్ ధర రూ. 78,500 తగ్గగా.. V CVT ధర రూ. 79,800 తగ్గింది. V MT వేరియంట్ ధర రూ. 69,100 తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పటికే ఇతర కంపెనీలు.. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా, కియా ఇలా అన్నీ తమ మోడళ్లపై ధరల్ని తగ్గించాయి.