Gold Rate Today: దసరా సంబరాలు మొదలయ్యాయి. దుర్గాదేవి శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ క్రమంలో మహిళలకు స్వల్ప ఊరట లభించినట్లయింది. గత రెండు రోజులుగా భారీగా పెరుగుతూ బెంబేలెత్తించిన బంగారం ధరలు ఇవాళ శాంతించాయి. దేశీయ మార్కెట్లో ఏ మార్పు లేకుండా ఇవాళ స్థిరంగా ట్రేడవుతున్నాయి. అయితే, ఇది బులియన్ మార్కెట్ పై ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పండగల వేళ బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల రూపంలో షాక్ తగిలేలా చేస్తున్నాయి. బంగారం, ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 22వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుపై 16 డాలర్లకు పైగా పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ ధర రూ.3688 డాలర్లు దాటి ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఈరోజు ఔన్సుకు 1.16 శాతం మేర పెరిగింది. ఇప్పుడు ఔన్స్ సిల్వర్ రేటు 43.13 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇవాళ అదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములకు మార్పు లేకుండా రూ. 1,12,150 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల నగల తయారీ గోల్డ్ రేటు తులానికి ఎలాంటి మార్పు లేకుండా క్రితం రోజు ధర వద్ద అంటే రూ. 1,02,800 వద్దే ట్రేడవుతోంది. స్థిరంగానే వెండి రేటుహైదరాబాద్ మార్కెట్లో వెండి రేటు రెండు రోజులుగా స్థిరంగానే కొనసాగుతూ ఊరట కల్పిస్తోంది. అయినప్పటికీ రికార్డ్ స్థాయిలోనే ఉండడం ఆందోళన కలిగించే విషయమే. ఇవాళ కిలో వెండి ధర రూ.1,45,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక పుణె, వడోదర, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో కిలో వెండి రూ.1,35,000 వద్ద ఉండడం గమనార్హం. ఈ కథనంలోని బంగారం, వెండి రేట్లు సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం ఉదయం 7 గంటల సమయంలోనివి. అయితే మధ్యాహ్నానికి పసిడి ధరలు మారుతుంటాయి. ప్రాంతాల వారిగా వ్యత్యాసాలు ఉంటాయి. కొనే ముందు ధరలు ఎంతున్నాయో తెలుసుకోవడం చాలా అవసరం.