బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. తెలంగాణలో అతి భారీ వర్షాలు

Wait 5 sec.

తెలంగాణకు చేసింది హైదారాబాద్ వాతావరణ కేంద్రం. బంగాళాఖాతంలో ఈ నెల 25న ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఇది మరింత బలపడి మరుసటి రోజు.. అంటే 26న వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.వాతావరణ శాఖ ప్రకారం ఈ వాయుగుండం సెప్టెంబర్ 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావం కారణంగా.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ప్రస్తుతం.. మూడు రోజులుగా మధ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు, దక్షిణ ఆంధ్ర తీరం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు. ఇది కూడా వర్షాలకు కారణమవుతుందని వెల్లడించారు. తెలంగాణలోని కురుస్తున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం 10.8 సెం.మీ., మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 10.3 సెం.మీ., నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాలలో 8.6 సెం.మీ., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో 8.2 సెం.మీ., నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 7.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా వర్షం దంచికొట్టింది. భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు, పలు కాలనీలు పూర్తిగా జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు చెరువులను తలపించాయి. మల్లాపూర్‌, గాంధీనగర్‌, గౌతమ్‌నగర్‌, నాచారం, హయత్‌నగర్‌, కాప్రా, మీర్జాల్‌గూడ, కూకట్‌పల్లి, ఎస్సాఆర్ నగర్, పంజాగుట్టు, ఖైరతాబాద్, అమీర్ పేట్, ఖైరతాబాద్, వెంకటగిరి ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హయత్‌నగర్‌ డిఫెన్స్‌ కాలనీలో 8.7 సెంమీ, కాప్రాలో 7, చర్లపల్లిలో 6.1, ఉప్పల్‌లో 5.9, మల్కాజిగిరిలో 5.5 సెం.మీ. వర్షం కురిసింది. నేడు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం, వాయుగుండం ఏర్పడిన తర్వాత వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు.