: నేటి నుంచే (సెప్టెంబర్ 22) జీఎస్టీ కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. దీంతో.. వినియోగదారులకు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాల్ని అందించేందుకు.. . ఇప్పుడు ప్రముఖ టెలివిజన్ కంపెనీలు కూడా జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనాల్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించాయి. ఇక్కడ టీవీల మోడల్, అంగుళాల్ని బట్టి కనీసం రూ. 2500 నుంచి గరిష్టంగా రూ. 85 వేల వరకు తగ్గింపు ప్రకటించాయి. ఇంకా వినియోగదారులకు ఇక్కడ పండగ సీజన్ ఆఫర్లు సహా జీఎస్టీ రేట్ల కోత ప్రయోజనం కూడా అందనుంది. 32 అంగుళాలు పైబడిన టీవీలపై జీఎస్టీ రేటు అంతకుముందు 28 శాతంగా ఉండగా.. ఇప్పుడు 18 శాతానికి చేరింది. ఎల్‌జీ, సోనీ, పానాసోనిక్ వంటి టాప్ బ్రాండ్స్ నేటి నుంచే అమలయ్యే తమ ప్రొడక్ట్స్ కొత్త రేట్లను ప్రకటించాయి. >> సోనీ ఇండియా: ఇక్కడ 43 నుంచి 98 అంగుళాల వరకున్న బ్రేవియా టీవీ మోడళ్లపై కనీసం రూ. 5 వేల నుంచి 71 వేల వరకు తగ్గింది. 43 అంగుళాల బ్రేవియా 2 ధర రూ. 59,900 నుంచి రూ. 54,900 కు చేరింది. 55 అంగుళాల టీవీ 7 ధర రూ. 2.80 లక్షలుగా ఉండగా.. రూ. 30 వేలు తగ్గింది. 98 ఇంచెస్ టాప్ ఎండ్ బ్రేవియా రూ. 9 లక్షల నుంచి రూ. 8.29 లక్షలకు దిగిరానుంది. >> ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా: 43- 100 అంగుళాల మధ్య మోడళ్లపై రూ. 2500 నుంచి రూ. 85,800 వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. 43 అంగుళాల మోడల్‌పై రూ. 30,990 నుంచి రూ. 28,490 కి తగ్గింది. 65 అంగుళాల టీవీ ధర రూ. 71,890 నుంచి రూ. 68,490 కి వచ్చింది. 100 ఇంచెస్ టీవీ ధర రూ. 5,85,590 నుంచి రూ. 4,99,790 కి తగ్గింది. >> పానాసోనిక్ తన మోడళ్లపై రూ. 3 వేల నుంచి రూ. 4700 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. 55 అంగుళాల టీవీ ధర రూ. 7 వేలు తగ్గింది. 65 అంగుళాల టాప్ బ్రాండ్ ధర రూ. 26 వేల వరకు తగ్గింది. 75 అంగుళాల టీవీ ధర రూ. 32 వేల వరకు తగ్గడం విశేషం.తగ్గిన ఏసీల ధరలు..ఇప్పుడు .. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం కూడా కలిసి రానుంది. ఏసీలపై సగటున రూ. 4500 వరకు తగ్గనుంది. డిష్ వాషర్లపై రూ. 8000 వరకు ధర తగ్గింది. ఇప్పటికే హైయర్, వోల్టాస్, పానాసోనిక్, గోద్రెజ్ వంటి సంస్థలు ధరల తగ్గింపుల్ని ప్రకటించాయి. కొత్త ధరలతో డీలర్ల దగ్గర బుక్ చేసుకోవచ్చని స్పష్టం చేశాయి.