అప్పటి వీడియోలను ఎమ్మెల్సీ నాగబాబుకు చూపించిన మంత్రి లోకేష్.. ఆసక్తికర సీన్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం శానసమండలిలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు.. ఏపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ కింద అప్పగించడంపై నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మండలి వాయిదా పడింది.. ఆ సమయంలో.. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. గత ప్రభుత్వంలో మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల నిరసనల వీడియోలను లోకేష్ నాగబాబుకు చూపించారు. ఆ వీడియోలను ఆసక్తిగా తిలకించారు.. ఆ సమయంలో లోకేష్, నాగబాబు పక్కన పలువురు మంత్రులూ ఉన్నారు. శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నిరసనల మధ్య ఛైర్మన్‌ మోషేను రాజు ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానం చెప్పారు. చనిపోయిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యుల్లో 2,569 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చామని ఆయన అన్నారు. మొత్తం 3,441 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. అంటే, టీచర్లు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో 411 S.I. పోస్టులను భర్తీ చేశామని హోంమంత్రి అనిత చెప్పారు. అలాగే 6,100 కానిస్టేబుల్ పోస్టులకు నియామక ప్రక్రియ పూర్తయిందని ఆమె అన్నారు. ఎమ్మెల్సీలు ఏసురత్నం, రవీంద్రనాథ్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. పోలీసులు ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతోంది అని ఆమె తెలిపారు.పోలవరం ప్రాజెక్టు కారణంగా 96,660 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని అంచనా వేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎమ్మెల్సీ రవిబాబు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. మొదటి దశలో 38,060 కుటుంబాలకు, రెండో దశలో 58,600 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు ఔట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమిస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, బీద రవిచంద్ర అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.