ఫెడ్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా తగ్గిన బంగారం ధరలు.. తనిష్క్, మలబార్ సహా ప్రముఖ జువెలర్స్‌లో గోల్డ్ రేట్లు ఇవే

Wait 5 sec.

Gold Price: పసిడి ప్రియులకు ఇది మంచి అవకాశం. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. అంతా ఊహించినట్లుగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించింది. 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లలో కోత పెట్టింది. దీంతో ప్రస్తుతం వడ్డీ రేట్లు 4- 4.25 స్థాయికి తగ్గాయి. అలాగే ఈ ఏడాదిలోనే మరో రెండు సార్లు వడ్డీ రేట్లు తగ్గించవచ్చని సూత్రప్రాయంగా తెలిపారు. సాధారణంగా అయితే వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికా డాలర్, బాండ్ ఈల్డ్స్ తగ్గి బంగారం రేటు పెరుగుతుంది. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా జరిగింది. అంచనాలతో గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఆల్ టైమ్ హై స్థాయిని తాకాయి. వడ్డీ రేట్ల తగ్గింపుతో డాలర్ పుంజుకుంది. బాండ్ ఈల్డ్స్‌లో పెట్టుబడులు పెంచుకునేందుకు, బంగారంలో ప్రాఫిట్ బుకింగ్స్‌కు మదుపరులు దిగడంతో ధరలు తగ్గినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దసరా పండగకు ముందు బంగారం ధరలు దిగిరావడం మంచి అవకాశంగా చెప్పవచ్చు. దసరాకు బంగారం కొంటే మంచిదని భావిస్తారు. దీంతో చాలామంది కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. ఈ తరుణంలోనే ధరలు తగ్గడం గిరాకీని పెంచుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 500 మేర దిగివచ్చింది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌లో సెప్టెంబర్ 18వ తేదీన సాయంత్రం 22 క్యారెట్ల గోల్డ్ జువెలరీ రేటు ఒక గ్రాముకు రూ. 10,190 వద్ద ఉండగా 10 గ్రాములకు రూ. 1,01,900 వద్ద ఉంది. జయాలుక్కాస్ జువెలరీ ఇక తులానికి రూ. 1,01,900 వద్ద ట్రేడవుతోంది. కల్యాణ్ జువెలర్స్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జువెలరీల్లో ఒకటైన కల్యాణ్ జువెలర్స్ లో ఈరోజు 22 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు రూ. 10,190 వద్ద ట్రేడవుతోంది. తనిష్క్ జువెలరీ.. తనిష్క్ జువెలరీ సంస్థలో ఈరోజు 22 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర గ్రాముకు రూ. 10,230 వద్ద ఉంది. క్రితం రోజు రూ. 10,280 వద్ద ఉండగా రూ. 50 మేర తగ్గింది. ఇక 10 గ్రాములకు రూ. 1,02,300 వద్ద ట్రేడవుతోంది.