తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కొత్తగా రెండు పథకాలను ప్రారంభించింది. మైనారిటీల సంక్షేమం కోసం ఈ పథకాలను తీసుకొచ్చింది.సెక్రటేరియట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వీటిని ప్రారంభించారు. 'ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘’ పేరుతో ఈ పథకాలను అమలు చేయనున్నారు. మైనారిటీ వర్గాలకు చెందిన వితంతు, విడాకులు తీసుకున్నవారు, అనాథలు, అవివాహిత మహిళలకు, ఫకీర్, దూదేకుల వంటి సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు ఈ పధకాల ద్వారా సహాయం అందజేయనున్నారు. ఈ రెండు పథకాల కోసం రూ.30 కోట్లు నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది.: ఈ పథకం కింద మైనార్టీ వర్గాలకు చెందిన వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు, అనాథలు, అవివాహిత (ఒంటరి) మహిళలకు స్వయం ఉపాధి కల్పన, చిరు వ్యాపారాలు ప్రారంభించడానికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందిస్తారు. రేవంత్ అన్న కా సహారా మిస్కీన్ల కోసం స్కీమ్ (రేవంత్ పేదల ఆర్థిక సహయ పథకం): ఫకీర్, దూదేకుల సామాజిక వర్గాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా రూ. లక్ష ఆర్ధిక సహాయం అందిస్తారు. మోపెడ్స్ కొనుగోలుకు సాయం అందిస్తారు. దీని ద్వారా వారు తమ జీవనోపాధిని మెరుగుపర్చుకుంటారని, స్వయం ఉపాధికి తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది.ఈ రెండు పథకాల కోసం రూ. 30 కోట్లు నిధులు కేటాయించినట్టు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ తెలిపారు. పథకానికి దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 19, 2025 మొదలైంది. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 6 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మైనారిటీ వర్గాలకు చెందిన అందరికి సమగ్ర సంక్షేమాన్ని అందించడానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఈ పథకాలు వారి జీవితాల్లో మార్పును తీసుకొస్తాయని మంత్రి పేర్కొన్నారు.