తెలంగాణలో దసరా పెద్ద పండుగ. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు సైతం దసరా పండుగకు ఇంటికి చేరుకుంటారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే ప్రయాణికుల రద్దీ మొదలవుతుంది. ఇక ఆదివారం అనగా సెప్టెంబర్ 21 నుంచి రాష్ట్రంలో విద్యా సంస్థలకు దసరా సెలవులు. దీంతో చాలా మంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. . దీంతో పాటు పండగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు కూడా ఆర్టీసీ సిద్ధమవుతోంది. దసరా పండుగ వేళ ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేందుకు సిద్ధమైన ఆర్టీసీ బస్ టికెట్ ధర మీద 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఆ వివరాలు.. బతుకమ్మ, దసరా పండగల సందర్భంగా నడిపే . ఈ బస్సుల్లో టికెట్ ఛార్జీ మీద 50 శాత అదనంగా వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. దసరా పండుగ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ అనగా శనివారం నుంచి నుంచి అక్టోబరు 2 వరకు దాదాపు 13 రోజుల పాటు 7,754 అదనపు సర్వీసులను నడిపేందుకు ఆర్టీసీ కార్యచరణ రూపొందించింది. సెప్టెంబర్ 20 నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. వీటిల్లో మాత్రమే అదనపు ఛార్జీలను వసూలు చేస్తారు. హైదరాబాద్‌ నుంచి వ్యాప్తంగా అలానే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు కూడా ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. దసరా సందర్భంగా పల్లెవెలుగు సహా అన్ని ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధర మీద 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు ఆర్టీసీ రెడీ అయ్యింది. పండగ ముగిశాక తిరుగుప్రయాణాల కోసం అక్టోబరు 5, 6 తేదీలలో కూడా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసు ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నుంచి మొదలు కానున్న ప్రయాణాలుతెలంగాణలో విద్యాసంస్థలకు ఈ నెల అనగా సెప్టెంబర్ 21 నుంచి దసరా సెలవులు ప్రారంభమవుతాయి. ఈక్రమంలో 20వ తేదీ అనగా శనివారం సాయంత్రం, 21న ఆదివారం నాడు ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. శని, ఆదివారం ఈ రెండు రోజుల్లోనే 1,079 ప్రత్యేక బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. అలానే సెప్టెంబర్ 30న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 2న దసరా పండుగ ఉండటంతో . ఈ క్రమంలో సెప్టెంబర్ 27 నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు ఆయా రోజుల్లో పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించారు.ప్రత్యేక బస్సుల్లోనే అదనపు ఛార్జీలు.. ఛార్జీల పెంపు గురించి ఆర్టీసీ యాజమాన్యం మాట్లాడుతూ.. ‘జీవో నం.16 ప్రకారం దసరా ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తాము. రిటర్న్‌లో చాలా వరకు బస్సులు ఖాళీగా రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈక్రమంలో బస్సులకు అయ్యే కనీస డీజిల్‌ ఖర్చులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధర మీద 50 శాతం అదనంగా వసూలు చేయనున్నాం. అయితే ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్‌ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు’ అని ఆర్టీసీ తెలిపింది. ప్రత్యేక ఏర్పాట్లు ఇక్కడి నుంచే..హైదరాబాద్‌ సిటీలోని మెయిన్ బస్టాండ్లయిన ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు.. ప్రయాణికుల సంఖ్య భారీగా ఉండే ఉప్పల్ బస్టాండ్, కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్‌ క్రాస్‌రోడ్స్, ఆరాంఘర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. పోయిన సంవత్సరం అనగా 2024 దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ 7,137 ప్రత్యేక బస్సులు నడపగా.. ఈ సంవత్సరం అంతకన్నా 617 ఎక్కువ బస్సులు నడపనున్నట్లు పేర్కొంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం టీజీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది.