ఆ విద్యార్థులకు నెలకు రూ.300 వరకు ఇస్తారు.. ఆ డబ్బులు నేరుగా బ్యాంక్ అకౌంట్‌లలో జమ

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు ఒక శుభవార్త చెప్పింది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు డబ్బులు ఇవ్వనుంది. ఈ మేరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో నక్కపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, అనకాపల్లి, పాయకరావుపేట సహా పలు ప్రాంతాల్లో నడిచే సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు. అయితే వీరికి వస్తువుల కొనుగోలు కోసం డబ్బులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ప్రస్తుతం వసతి గృహాల్లో ఉంటున్న 3,569 మంది విద్యార్థులకు ప్రభుత్వం కాస్మోటిక్ ఛార్జీలు చెల్లిస్తోంది. బాల, బాలికలకు తరగతుల వారీగా నెలకు రూ.125 నుంచి రూ.255 వరకు ఇస్తున్నారు. హెయిర్ కటింగ్ కోసం అదనంగా రూ.50 ఇస్తున్నారు.. అంటే మొత్తం కలిపి దాదాపు రూ.300 వరకు ఉంటుంది. ఈ డబ్బుల్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. అలాగే వసతి గృహాల్లో మంచి వసతులు కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. కాస్మోటిక్ సామాగ్రి కొనుగోలు కోసం మొదటి విడతలో రూ.23 లక్షలు, రెండో విడతలో రూ.16 లక్షలు విడుదల చేసింది. 3 నుంచి 6 తరగతులు చదివే బాలురకు నెలకు రూ. 125, బాలికలకు రూ. 130 ఇస్తారు. 7 నుంచి 10 తరగతులు చదివే బాలురకు రూ. 150, బాలికలకు రూ. 200 ఇస్తారు. ఇంటర్ చదివే బాలురకు రూ. 200 నుంచి రూ. 265 వరకు ఇస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. వసతి గృహ విద్యార్థులకు ఛార్జీలు ఎప్పటికప్పుడు అందజేస్తారు.. టూత్‌పేస్టు, కొబ్బరి నూనె, షాంపూ, సబ్బులు కొనడానికి ప్రతీ నెల ఇలా కొంత డబ్బు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల, ఆదర్శ, కేజీబీవీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్ కిట్లు కూడా పంపిణీ చేయనున్నారు. కొబ్బరి నూనె, టూత్‌ పేస్ట్, టూత్‌ బ్రష్, టంగ్‌ క్లీనర్, పౌడర్‌ డబ్బా, షాంపూ, సబ్బులు వంటివి ఇస్తారు. బాలికలకు రుతుక్రమ సమయంలో ఉపయోగించే రుమాళ్లు కూడా ఇస్తారు. బాలుర హెయిర్ కటింగ్ చేయించుకునేందుకు ఛార్జీలను కూడా పెంచారు.. గతంలో రూ.30 ఉండగా ఇప్పుడు రూ.50 చేశారు.